Uma Bharti: గోశాలలుగా మద్యం దుకాణాలు.. అలా జరగడానికి కారణం అదే.. మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్..

సంచలన కామెంట్లు చేసి.. ఎప్పుడూ వార్తల్లో నిలిచే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లో లిక్కర్‌ షాపులను గోశాలలుగా మారుస్తున్నట్లు చెప్పారు...

Uma Bharti: గోశాలలుగా మద్యం దుకాణాలు.. అలా జరగడానికి కారణం అదే.. మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్..
Uma Bharati
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 01, 2023 | 2:52 PM

సంచలన కామెంట్లు చేసి.. ఎప్పుడూ వార్తల్లో నిలిచే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లో లిక్కర్‌ షాపులను గోశాలలుగా మారుస్తున్నట్లు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న లిక్కర్‌ దుకాణాలపై చర్యలు తీసుకోవాలని ఆమె ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సర్కార్‌ను డిమాండ్‌ చేశారు. అయితే.. గడువు ముగిసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మద్యం దుకాణాలను గోశాలలుగా మార్చే ప్రయత్నాలు చెస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయి. మహిళలపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. మద్యం కారణంగానే ఈ దాడులు, గొడవలు జరుగుతున్నట్లు ఉమాభారతి చెబుతున్నారు. దీంతో భోపాల్ అయోధ్య నగర్‌లోని ఓ ఆలయం వద్ద ఉన్న లిక్కర్‌ షాప్‌ ముందు నాలుగు రోజుల దీక్ష చేపట్టారు. ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో ఉమా భారతి చేపట్టిన దీక్ష నిన్న (మంగళవారం) తో ముగిసింది. అయినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం గమనార్హం.

రాముడి పేరు చెప్పుకుని ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారు. అదే రాముడి గుడి దగ్గర లిక్కర్‌ షాపులు ఏర్పాటు చేయడం ఎంత వరకు సమంజసం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పెద్ద విషయం కాదు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేయడం ముఖ్యం. మహిళలకు, భవిష్యత్‌ తరాలకు భద్రత కల్పించడమే నిజమైన అభివృద్ధి. పార్టీలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. మద్యం నిషేధంపై ఉద్యమించినంత మాత్రానా నాకు ప్రధాని పదవి దక్కుతుందా?.. ఇలా ప్రచారం చేయడం సరికాదు.

– ఉమాభారతి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

అంతేకాకుండా.. లిక్కర్‌ పాలసీ అమలు చేయాలని తాము ఇకపై కోరుకోవడం లేదని, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న లిక్కర్‌ షాపులను దగ్గరుండి తానే గోశాలలుగా మారుస్తానని ఆమె సంచనల ప్రకటన చేశారు. ఆ దుకాణాల బయట 11 ఆవుల్ని ఏర్పాటు చేయాలని తన బృందానికి ఆదేశాలు జారీ చేశారు. తనను ఆపే ధైర్యం ఎవరికి ఉందో చూస్తానంటూ వార్నింగ్ కూడా ఇవ్వడం గమనార్హం.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.