Jawaharlal Nehru: 11 సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్.. 9 సార్లు జైలుకు.. ప్రథమ ప్రధాని జీవితంలో విశేషాలెన్నో..

దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు పిల్లలకు చాలా ప్రత్యేకమైనది. స్కూళ్లల్లో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు, కాంపిటీషన్లు నిర్వహిస్తుంటారు. ఏటా నవంబర్ 14 న దేశంలో...

Jawaharlal Nehru: 11 సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్.. 9 సార్లు జైలుకు.. ప్రథమ ప్రధాని జీవితంలో విశేషాలెన్నో..
Jawaharlal Nehru

Updated on: Nov 14, 2022 | 9:45 AM

దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు పిల్లలకు చాలా ప్రత్యేకమైనది. స్కూళ్లల్లో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు, కాంపిటీషన్లు నిర్వహిస్తుంటారు. ఏటా నవంబర్ 14 న దేశంలో బాలల దినోత్సవం జరుపుకుంటారు. స్వతంత్ర భారతదేశం మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఈ వేడుకను జరుపుకుంటారు. నెహ్రూకు పిల్లల పట్ల అపారమైన ప్రేమ, అభిమానం ఉండేది. దేశపు పిల్లలే భారతదేశ భవిష్యత్తు అని నమ్మిన వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 1889 నవంబర్ 14న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జన్మించారు. ఆయనకు పిల్లలన్నా, గులాబీ పూలు అన్నా చాలా ఇష్టం. లింగ, వర్ణ, మత, కుల వివక్ష చూపించకుండా పిల్లలందరినీ ఆదరించేవారు. బాలల దినోత్సవం సందర్భంగా.. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గురించి కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

జవహర్‌లాల్ నెహ్రూ కాశ్మీర్ పండిట్ కుటుంబానికి చెందినవారు. ఆయనకు అక్క విజయ లక్ష్మి పండిట్, చెల్లి కృష్ణ హుతీసింగ్ తోబుట్టువులు. నెహ్రూ 11 సార్లు నోబెల్ బహుమతికి నామినేట్ అయినా ఆయనకు ఆ పురస్కారం దక్కకపోవడం గమనార్హం. శాంతి నోబెల్ కోసం నెహ్రూ నామినేట్ అయ్యారు. జవహర్‌లాల్ నెహ్రూ కేంబ్రిడ్జ్‌లోని హారో అండ్ ట్రినిటీ కాలేజీలో చదువుకున్నారు. ఇన్నర్ టెంపుల్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ లాస్ పూర్తి చేశారు. నెహ్రూ ఆగస్టు 1912లో భారతదేశానికి తిరిగి వచ్చారు. తరువాత అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేసుకోవడం ద్వారా తనను తాను బారిస్టర్‌గా పరిచయం చేసుకున్నారు. 1929లో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలో జరుగుతున్న స్వాతంత్ర్య పోరాటంలో ప్రధాన పాత్ర పోషించారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూను ‘ఆధునిక భారతదేశపు ఆర్కిటెక్ట్’ అని కూడా పిలుస్తారు.

జనవరి 1934 నుంచి ఫిబ్రవరి 1935 వరకు జైలులో ఉన్నారు. ఆ సమయంలో తన ఆత్మకథను రాసుకున్నారు. ఈ పుస్తకం 1936లో అమెరికాలో ప్రచురితమైంది. 1964 మే 27న గుండెపోటుతో నెహ్రూ కన్నుమూశారు. ఢిల్లీలో జరిగిన ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు దాదాపు 15 లక్షల మంది తరలి వచ్చారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ తొమ్మిది సార్లు జైలుకు వెళ్లారు. 3,259 రోజులు జైలులో ఉన్నారు. 1927లో సంపూర్ణ జాతీయ స్వాతంత్య్రాన్ని ప్రతిపాదించిన మొదటి వ్యక్తి నెహ్రూ కావడం విశేషం. ఇండియన్ సివిల్ సర్వీస్ తో సహా బ్రిటీష్ సామ్రాజ్యంతో భారతీయుల అన్ని సంబంధాలను తెంచుకుంటున్నట్లు ఆయన ప్రకటించడం అప్పట్లో పెను సంచలనం కలిగించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..