కర్నాటక బీజేపికి అసమ్మతి తలనొప్పిగా మారింది. మొన్న మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడే రాజీనామా చేస్తే.. నిన్న మాజీ సీఎం జగదీష్ శెట్టార్ బీజేపీని వీడారు. అసెంబ్లీ ఎన్నికల్లో హుబ్లీ నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశించారు శెట్టార్. అయితే, బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు. దశాబ్దాల పాటు బీజేపీకి సేవలు చేసినందుకు తనకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ జాబితాలో 54 మందికి కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చింది. పలువురు సీనియర్లకు ఈసారి టిక్కెట్లు ఇవ్వలేదు. ఈ క్రమంలోనే మల్లిఖార్జున్ ఖర్గే, సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లతో భేటీ అయిన శెట్టార్.. హస్తం కండువా కప్పుకున్నారు. ఎన్నికల వేళ వరుసగా నేతలు బీజేపీకి రాజీనామా చేస్తుండటంతో రాష్ట్రనాయకత్వం తలలు పట్టుకుంటోంది.
బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, కాంగ్రెస్ నేతలు రణదీప్ సూర్జేవాలా, సిద్ధరామయ్య సమక్షంలో కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ కాంగ్రెస్‌లో చేరారు.
#WATCH | Former Karnataka CM Jagadish Shettar joins Congress, in the presence of party president Mallikarjun Kharge, KPCC president DK Shivakumar & Congress leaders Randeep Surjewala, Siddaramaiah at the party office in Bengaluru.
Jagadish Shettar resigned from BJP yesterday. pic.twitter.com/vxqVuKKPs1
— ANI (@ANI) April 17, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం..