Assam grim: అసోం జనం ఆర్తనాదాలు.. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు కూడా లేని దుర్భర పరిస్థితిలు
లు గడ్డన పెడుదామంటే.. గజం జాగలేదు. వంట చేసుకుందామంటే.. సరుకులు లేవు, తినడానికి తిండ లేదు, తాగడానికి పాలు కాదు కదా.. నీళ్లు కూడా లేవు.
Assam grim: కాలు గడ్డన పెడుదామంటే.. గజం జాగలేదు. వంట చేసుకుందామంటే.. సరుకులు లేవు, తినడానికి తిండ లేదు, తాగడానికి పాలు కాదు కదా.. నీళ్లు కూడా లేవు. అంతా నీటి మయం. ఎటు చూసినా.. నీరే కనిపిస్తోంది. దాచుకున్న బియ్యం నీట మునిగాయి, తెచ్చుకున్న సరుకులు పాడయ్యాయి.. రోజుల తరబడి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో అసోం జనం ఆర్తనాదాలు చేస్తున్నారు. భారీ వర్షాలకు అసోం అతలాకుతలం అవుతోంది. 21 జిల్లాలు నీటిలో నానుతున్నాయి.
మొత్తంగా అసోం రాష్ట్రంలో 3 లక్షల 63 వేల మంది లక్షల మంది వరదల బారిన పడ్డారు. బార్ పేట, మోరిగావ్ జిల్లాల్లో ఇద్దరు వ్యక్తులు వరదనీటిలో కొట్టుకుపోయారు. ఈ 21 జిల్లాల్లో 3 లక్షల 63 వేల మంది వరదల వల్ల అవస్థలు పడుతున్నారని అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ప్రకటించింది. ఒక్క లఖింపూర్ జిల్లాలోనే దాదాపు లక్షా 30 వేల మంది వరదల వల్ల ప్రభావితమయ్యారు.
బ్రహ్మపుత్ర నదితోపాటు దాని ఉపనదులు వరదనీటితో పొంగి ప్రవహిస్తుండటంతో 30 వేల హెక్టార్లలో పంటలు నీటమునిగాయి. 21 జిల్లాల్లోని 950 గ్రామాలు నీట మునగడంతో జనజీవనం మొత్తం అస్తవ్యస్తమైంది. నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరదనీటి ధాటికి బార్ పేట, దరాంగ్, గోలాఘాట్,చ మోరిగావ్, నాగావ్, శివసాగర్ జిల్లాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి.