CM Yogi Adityanath: యోగి మార్క్‌ పాలన.. గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ భూముల్లో పేదల కోసం ఫ్లాట్లు

ఉత్తర్‌ ప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్‌ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన అతీక్‌ అహ్మద్‌ నుంచి స్వాధీనం చేసుకున్న భూమిలో పేదల కోసం 76 ఫ్లాట్లను నిర్మించారు. వీటిని లాటరీ పద్ధతి ద్వారా పేదలకు అప్పగించనున్నారు. రెండు గదులున్న ఈ ఫ్లాట్‌లో ఒక వంటగది, టాయిలెట్‌ ఉంటుందన్నారు.

CM Yogi Adityanath: యోగి మార్క్‌ పాలన.. గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ భూముల్లో పేదల కోసం ఫ్లాట్లు
Cm Yogi Adityanath

Updated on: Jun 11, 2023 | 7:45 AM

ఉత్తర్‌ ప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్‌ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన అతీక్‌ అహ్మద్‌ నుంచి స్వాధీనం చేసుకున్న భూమిలో పేదల కోసం 76 ఫ్లాట్లను నిర్మించారు. వీటిని లాటరీ పద్ధతి ద్వారా పేదలకు అప్పగించనున్నారు. రెండు గదులున్న ఈ ఫ్లాట్‌లో ఒక వంటగది, టాయిలెట్‌ ఉంటుందన్నారు. ఈ ఫ్లాట్‌ ఖరీదు రూ. 6 లక్షల రూపాయలు.. ప్రయాగ్‌రాజ్‌లోని లూకర్‌గంజ్‌ పరిధిలోని అతీక్‌ నుంచి స్వాధీనం చేసుకున్న 1731 స్క్యేర్‌ మీటర్ల భూమిలో సరసమైన గృహ నిర్మాణ ప్రాజెక్టుకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ 2021 డిసెంబరు 26న శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఈ నిర్మాణం పూర్తయ్యింది. పేదలకు పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకప్పుడు యూపీ కింగుల్లా బతికిన గ్యాంగ్‌స్టర్ల అంతు తేలుస్తున్నారు ముఖ్యమంత్రి యోగి..వాళ్ల భూముల్లో పేదల కోసం ఇలా పక్కా ఇళ్లను కట్టిస్తూ..తనదైన మార్క్‌ పాలన సాగిస్తున్నారు.

ప్రయాగ్‌రాజ్‌ డెవలప్‌మెంట్‌ ఆథారిటీ ఉపాధ్యక్షుడు అరవింద్‌ కుమార్‌ మాట్లాడుతూ అలహాబాద్‌ మెడికల్‌ అసోసియేషన్‌కు చెందిన హాలులో పేదలకు ఫ్లాట్లను కేటాయించేందుకు లాటరీ పద్ధతిని ఏర్పాటుచేశామన్నారు. ఇందుకోసం మొత్తం 6030 మంది దరఖాస్తు చేసుకోగా 1590 మందిని లాటరీలో పాల్గొనేందుకు అర్హులుగా ఎంపికచేశామన్నారు. లబ్ధిదారులకు 41 స్క్వేర్‌ మీటర్లలో నిర్మితమైన ఫ్లాట్‌ రూ. 3 లక్షల 50 వేలకు అందజేయనున్నామని అరవింద్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..