General Knowledge: అణ్వాయుధాలు పెంచుకునే పనిలో పాకిస్తాన్.. మరి భారత్ వద్ద ఎన్ని ఉన్నాయో తెలుసా..
Nuclear Weapons: ప్రపంచంలోని అన్ని దేశాలు వేగంగా ఆర్థిక పురోగతి సాధిస్తున్నాయి. అయితే ఆర్థిక పురోగతి మాత్రమే సరిపోదు. శత్రువును ఎప్పుడు గమనిస్తుండాలి.. ప్రతి కదలిక ముప్పుగా మారే ఛాన్స్ ఉంది.

ప్రపంచం మొత్తం ఒకరితో మరొకరు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాలు వేగంగా ఆర్థిక పురోగతి సాధిస్తున్నాయి. అయితే ఆర్థిక పురోగతి మాత్రమే సరిపోదు. శత్రువును ఎప్పుడు గమనిస్తుండాలి.. ప్రతి కదలిక ముప్పుగా మారే ఛాన్స్ ఉంది. అందుకే శత్రువుల నుంచి పొంచి ఉన్న ముప్పును సమర్థంగా ఎదుర్కోవాలంటే దేశాల ఆయుధ వ్యవస్థ పటిష్ఠంగా ఉండేలా చూసుకోవలి. ఒకవేళ యుద్ధం వస్తే ఆధునిక ఆయుధాలతో అమ్ములపొది నిండుగా ఉంటేనే అది సాధ్యం. అప్పుడే విజయం మన పక్షంలో ఉంటుంది. ఏ దేశం దగ్గరైనా అణ్వాయుధాలు ఉంటే ఆ దేశం జోలికి వెళ్లేందుకు ఎదుటి పక్షం జంకుతుంది. ఈ నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ రెండు దేశాల వద్ద ఉన్న అణ్వాయుధాల సంఖ్య ఎలా పెరుగుతోందో ఓసారి చూద్దాం..
అణ్వాయుధాలు అత్యంత ప్రాణాంతకమైనవి-
ప్రాణాంతక ఆయుధాల విషయానికొస్తే, అణ్వాయుధాలను అత్యంత ప్రాణాంతకమైనవిగా పరిగణిస్తారు. ఏ దేశం వద్ద ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి. అయితే, అణ్వాయుధం అంటే భారీ విస్ఫోటనాల్ని సృష్టించగల ఓ ఆయుధం. ఈ విస్ఫోటనం వల్ల పెద్ద మొత్తంలో శక్తి విడుదలవడం ద్వారా భారీ విధ్వంసం నెలకొంటుంది. నిజానికి భారీ విస్ఫోటనాన్ని సృష్టించడానికి రెండు మార్గాలున్నాయి. మొదటిది- అణు కేంద్రకాన్ని బద్దలుకొట్టి చేసి శక్తిని పుట్టించడం. ఈ రకం వాటిని ఫిషన్ బాంబు అని కాని.. అణు బాంబు (atomic bomb) అని కాని కూడా అంటారు. 1968లో నాన్-ప్రొలిఫరేషన్ ట్రీటీ (NPT), 1996లో సమగ్ర అణు పరీక్ష నిషేధ ఒప్పందం (CTBT) జరిగింది.




విశేషమేమిటంటే, 1945లో, రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో US రెండు జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకిపై అణ్వాయుధాలను ప్రయోగించింది. దీంతో రెండు నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
రష్యాలో అత్యంత చురుకైన అణ్వాయుధాలు..
రష్యా వద్ద గరిష్టంగా 6500 అణ్వాయుధాలు ఉన్నాయి. వాటిలో 1600 క్రియాశీల స్థితిలో ఉన్నాయి. అదే సమయంలో, అమెరికా వద్ద మొత్తం 6185 అణ్వాయుధాలు ఉన్నాయి. 1600 క్రియాశీల స్థితిలో ఉన్నాయి. అణ్వాయుధాలను ప్రాతిపదికగా పరిగణిస్తే, రష్యా , అమెరికా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలు.
అణ్వాయుధాలను కలిగి ఉన్న దేశాలలో భారతదేశం, పాకిస్తాన్..
పొరుగు దేశం పాకిస్తాన్ వద్ద కూడా పెద్ద సంఖ్యలో అణ్వాయుధాలు ఉన్నాయి. ఆయుధాల గురించి సమాచార సేకరణ సంస్థ SIPRI ప్రకారం, పాకిస్తాన్ వద్ద ఈ ఆయుధాల మొత్తం సంఖ్య 100 నుంచి 120 ఉండగా.. భారతదేశం వద్ద 90-110 అణ్వాయుధాలు ఉన్నాయి. భారత్ రహస్యంగా పెద్ద ఎత్తున అణు కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని పాకిస్తాన్ తరచూ ఆరోపిస్తోంది. అయితే, ఇది ఎంతవరకు నిజమో ఆ సంస్థ ధృవీకరించడం లేదు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం




