Arvind Kejriwal: మనీష్ సిసోడియా భారత్ రత్నకు అర్హుడు.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

దేశంలో 70 ఏళ్లలో ఏ పార్టీ చేయని విధంగా ప్రభుత్వ పాఠశాలలను సంస్కరించి.. విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పులకు డిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు భారతరత్న ఇచ్చి.. దేశంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పలు..

Arvind Kejriwal: మనీష్ సిసోడియా భారత్ రత్నకు అర్హుడు.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Arvind Kejriwal
Follow us

| Edited By: Team Veegam

Updated on: Aug 25, 2022 | 4:03 PM

Arvind Kejriwal: దేశంలో 70 ఏళ్లలో ఏ పార్టీ చేయని విధంగా ప్రభుత్వ పాఠశాలలను సంస్కరించి.. విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పులకు డిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు భారతరత్న ఇచ్చి.. దేశంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పలు తీసుకొచ్చే బాధ్యత ఆయనకు అప్పగించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈఏడాది చివరిలో గుజరాత్ శాసనసభకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మనీష్ సిసోడియాతో కలిసి అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా మీడియాతో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు తీసుకొచ్చిన వ్యక్తికి దేశ విద్యావ్యవస్థ బాధ్యతలను అప్పగించాల్సింది పోయి అక్రమ కేసులు బనాయించి సీబీఐ దాడులతో వేధిస్తున్నారని కేంద్రప్రభుత్వ వైఖరిపై అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. మనీష్ సిసోడియా వంటి వ్యక్తులను భారత రత్నతో గౌరవించుకోవల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలో నూతన మద్యం విధానాల అవకతవకల ఆరోపణల కేసులో సీబీఐ దర్యాప్తు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనర్హం. నెలలోపు ఐదోసారి అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. ఈసారి మనీష్ సిసోడియాతో కలిసి ఆయన పర్యటించడం విశేషం. ఈసందర్భంగా తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దానిపై అరవింద్ కేజ్రీవాల్ గుజరాతీ ప్రజలకు మరిన్ని హామీలు గుప్పించారు. గుజరాతీలకు నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలు అందించే బాధ్యతను ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకుంటుందని, వచ్చే శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాలని అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ ప్రజలను కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరుస్తామన్నారు. అవసరమైతే మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు నూతన ఆసుపత్రులను నిర్మిస్తామన్నారు.

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. ఢిల్లీలో బీజేపీకి సీఎం అభ్యర్థిలేరని తాను ఆమ్ ఆద్మీని వదిలివస్తే ముఖ్యమంత్రిని చేస్తారని.. దీనిలో భాగంగానే బీజేపీలో చేరితే తనపై కేసులు మూసివేస్తామనే సందేశాన్ని పంపారని ఆరోపించారు. ఇప్పటికే పశ్చిమబెంగాల్ లో సువేందు అధికారి, అస్సాంలో హిమంత బిస్వా శర్మను బీజేపీలో చేర్చుకుని.. తగిన ప్రాధాన్యత కల్పించామన్న విషయన్ని గుర్తించుకోవాలని తనకు సందేశం పంపిన వ్యక్తి చెప్పారని అహ్మదాబాద్ లో మరోసారి మనీష్ సిసోడియా ఈవిషయాన్ని ప్రస్తావిస్తూ చెప్పారు. తాను సీఎం కావాలని కలలు కనడం లేదని, ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించాలని మాత్రమే కలలు కంటున్నాను.. అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే ఈవాగ్దానాన్ని నెలవేర్చగలరని సిసోడియా పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..