Nirmala Sitharaman: ఆ ఏడాదికి అభివృద్ధి చెందిన భారత్‌గా మారుతుంది.. కీలక వ్యాఖ్యలు చేసిన నిర్మలా సీతారామన్

ఎన్నో ఏళ్ల నుంచి భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకుంటూనే వస్తున్నారు. అయితే ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది అనే దానిపై స్పష్టత లేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలు అభివృద్ధి చెందుతున్న దేశం అని అనుకుంటూ పోవాలని చాలామంది భావిస్తారు. అయితే ఇందుకు సంబంధించిన విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.

Nirmala Sitharaman: ఆ ఏడాదికి అభివృద్ధి చెందిన భారత్‌గా మారుతుంది.. కీలక వ్యాఖ్యలు చేసిన నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman

Updated on: Jul 30, 2023 | 8:49 AM

ఎన్నో ఏళ్ల నుంచి భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకుంటూనే వస్తున్నారు. అయితే ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది అనే దానిపై స్పష్టత లేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలు అభివృద్ధి చెందుతున్న దేశం అని అనుకుంటూ పోవాలని చాలామంది భావిస్తారు. అయితే ఇందుకు సంబంధించిన విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్‌గా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఇందుకోసం ముఖ్యంగా నాలుగు అంశాలపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. అవి మౌళిక వసతులు, పెట్టుబడులు, ఆవిష్కరణలు అలాగే దేశంలోని అందరికీ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలను అందించడమని నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రధాని మోదీ నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సాధించేందుకు ఇండియా అన్ని రకాల చర్యలు చేపడుతోందని తెలిపారు. అలాగే పెట్టుబడిదారులకు కూడా తమ ప్రభుత్వం అనుకూల సంస్కరణలు తీసుకొచ్చిందని గుర్తుచేశారు. భారత్‌లో యువత జనాభా ఎక్కువగా ఉండటం సానుకూల అంశమని.. వారిని ఆర్థిక వ్యవస్థ అవసరాలకు తగిన విధంగా నైపుణ్యవంతులుగా తీర్చిదిద్డం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చని అన్నారు.

గత మూడు సంవత్సరాల్లో మౌళిక సదుపాయల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు ఇచ్చిందన్నారు. 2022-23లో ఇందుకోసం రూ.10 లక్షల కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. అలాగే మౌళిక సదుపాయలతో పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తే ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు మరిన్ని పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించినట్లు అవుతుందని తెలిపారు. వాస్తవానికి మౌళిక వసతులు అంటే కేవలం ఓడరేవులు, వంతెనలు, విమానాలు మాత్రమే కావని.. ఇటీవల వచ్చిన డిజిటల్ మౌళిక వసతులు కూడా సృష్టించడం ముఖ్యమని ఆమె అన్నారు. పెట్టుబడుల పరంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల భాగస్వామ్యం పెరగాలని అనుకుంటున్నామని.. ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణకు పలు విధానాలు చేపడుతున్నామని చెప్పారు. అలాగే అందుకోసం అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి