‘ చాణక్య నీతి ‘ ని ప్రస్తావించిన నిర్మల
దృఢమైన భారతం కోసం దృఢమైనప్రజలే మా నినాదమని అన్నారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. శుక్రవారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ను సమర్పించిన సందర్భంగా ఆమె.. చాణక్య నీతిని గుర్తు చేశారు. ” కార్య పురుష కరేన,, లక్యం..సంపాదయతే ‘.. అని చాణక్య నీతి చెబుతోందన్నారు. అంటే మానవ ప్రయత్నం ఖఛ్చితంగా ఉంటే ఎలాంటి లక్ష్యాలనైనా పూర్తి చేయగలమని అర్థం ‘ అని వివరించారు. గత ఐదేళ్లలో దేశం అతి వేగంగా అభివృధ్ది చెందిందని, మన ఆర్ధిక […]
దృఢమైన భారతం కోసం దృఢమైనప్రజలే మా నినాదమని అన్నారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. శుక్రవారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ను సమర్పించిన సందర్భంగా ఆమె.. చాణక్య నీతిని గుర్తు చేశారు. ” కార్య పురుష కరేన,, లక్యం..సంపాదయతే ‘.. అని చాణక్య నీతి చెబుతోందన్నారు. అంటే మానవ ప్రయత్నం ఖఛ్చితంగా ఉంటే ఎలాంటి లక్ష్యాలనైనా పూర్తి చేయగలమని అర్థం ‘ అని వివరించారు. గత ఐదేళ్లలో దేశం అతి వేగంగా అభివృధ్ది చెందిందని, మన ఆర్ధిక వ్యవస్థ ఒక ట్రిలియన్ డాలర్లకు చేరడానికి 55 ఏళ్ళు పట్టిందని, ఎన్డీయే అధికారంలోకి వచ్ఛే నాటికి దేశ ఆర్ధిక వ్యవస్థ 1.85 లక్షల కోట్ల డాలర్లుగా ఉందని ఆమె తెలిపారు. బీజేపీ అధికారంలోకి వఛ్చిన అనంతరం ఐదేళ్లలోనే ఆర్ధిక వ్యవస్థ లక్ష కోట్ల డాలర్లకు చేరిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
తక్కువ ప్రభుత్వం..ఎక్కువ పాలనే మా విధానం అని ఆమె పేర్కొన్నారు. నిర్మలా సీతారామన్ తరచూ ఛలోక్తులు, చమత్కారాలతో ప్రసంగిస్తుండగా ప్రధాని మోదీతో బాటు పలువురు సభ్యులు హర్షాతిరేకంతో బల్లలు చరిచారు. డిజిటల్ చెల్లింపులపై ఎలాంటి టాక్స్ లేదని ఆమె ప్రకటించినప్పుడు కూడా ఇదే హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. బ్యాంకు అకౌంట్ నుంచి ఏడాదికి కోటి రూపాయలు డ్రా చేస్తే 2 శాతం పన్ను విధిస్తామన్నారు. అంటే.. బడా వ్యాపారులు, ప్రముఖుల ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె నిర్దిష్టంగా ఈ ప్రకటన చేసినట్టు కనిపిస్తోందని అంటున్నారు. మరోవైపు మధ్యతరగతి వర్గాల గృహ అవసరాలు తీర్చేందుకు 45 లక్షల గృహరుణం తీసుకున్నవారికి మూడున్నర లక్షల వడ్డీ రాయితీ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు.