Farmers Protest: కేంద్రంతో చర్చలు సఫలమైతేనే ఉద్యమం ఆపేస్తాం.. సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటన..

|

Dec 04, 2021 | 5:13 PM

కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాన్ని సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది...

Farmers Protest: కేంద్రంతో చర్చలు సఫలమైతేనే ఉద్యమం ఆపేస్తాం.. సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటన..
Farmers Union
Follow us on

కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాన్ని సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది. కనీస మద్దతు ధరపై కేంద్రంతో ఈ బృందం చర్చలు జరపనుంది. రాకేశ్‌ టికాయత్‌తో పాటు గుర్నామ్‌సింగ్‌, బల్బీర్‌సింగ్‌ రాజేవాల్‌, అశోక్‌ ధావ్లే, శివకుమార్‌, యుద్‌వీర్‌సింగ్‌‌లు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. సాగుచట్టాల రద్దు రైతుల విజయమని భారతీయ కిసాన్ యూనియన్ లీడర్ రాకేశ్ టికాయత్ అన్నారు. కమిటీని ఏర్పాటు చేయడంలో ఆలస్యం జరిగిందన్న విమర్శలను ఆయన తప్పుపట్టారు. కేంద్రమే మూడు సాగు చట్టాల రద్దును ఆలస్యం చేసిందని విమర్శించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా గత రాత్రి చర్చలకు రావాలని తమను ఆహ్వానించారని.. చర్చలు విజయంతమైతే ఉద్యమాన్ని ఆపేస్తామని కూడా ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. సంయుక్త కిసాన్ మోర్చా తదుపరి సమావేశం డిసెంబర్ 7వ తేదీన జరుగుతుందని రాకేశ్ టికాయత్ చెప్పుకొచ్చారు. పార్లమెంట్‌లో మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును కేంద్రం ఆమోదించిన వారంలోపు సంయుక్త కిసాన్ మోర్చా తదుపరి సమావేశం జరగనుండటంతో.. ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైతులపై పెట్టిన కేసుల ఎత్తివేత , కనీస మద్దతు ధర , ఢిల్లీ శివార్లలో చనిపోయిన 702 మంది రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించే వరకు ఉద్యమం కొనసాగుతుందని సంయుక్త కిసాన్‌ మోర్చా స్పప్టం చేసింది.

ఇవి కూడా చదవండి:

పడగవిప్పి కోపంతో రగిలిపోతున్న భారీ నాగుపాము చూశారా.? వెన్నులో వణుకు పుట్టించే వీడియో మీకోసమే!

17 బంతుల్లో 78 పరుగులు.. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్ల ఊచకోత.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో వీరవిహారం.!

అటకపై అనుకోని అలజడి.. ఎలుక అనుకుని వెళ్లి చూడగా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!