Viral Video: పడగవిప్పి కోపంతో రగిలిపోతున్న భారీ నాగుపాము చూశారా.? వెన్నులో వణుకు పుట్టించే వీడియో మీకోసమే!
పాముల్లో నాగుపాము ఎంత ప్రమాదకరమైనదో మనకు తెలుసు. అలాంటి ఒక నాగుపాము 12 అడుగుల పొడవుతో చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది.
పాముల్లో నాగుపాము ఎంత ప్రమాదకరమైనదో మనకు తెలుసు. అలాంటి ఒక నాగుపాము 12 అడుగుల పొడవుతో చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. ఒక తోటలో రేకులతో ఏర్పాటు చేసిన ప్రహరీ దాటబోయింది. ఇంతలో ఎవరో దీనిని గమనించి రెస్క్యూ టీమ్‌కి సమాచారమందించారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్స్ ఎంతో చాకచక్యంగా ఆ పామును పట్టుకున్నారు. దాంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ భారీ కోబ్రాకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ 12 అడుగుల కోబ్రా చాలా కోపంగా ఉంది. ఎవరిపైనో పగబట్టినట్టుగా చాలా వేగంగా ఆ తోటలోకి ప్రవేశించింది. అక్కడ రేకులతో కూడిన ప్రహరీని దాటడానికి ప్రయత్నించింది. స్ధానికుల సమాచారంతో రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్స్ దాన్ని పట్టుకోడానికి ఎంతగానో ప్రయత్నించారు. అయితే రెస్క్యూ టీమ్‌ని చూసి మరింత రగిలిపోయిన ఆ భారీ నాగుపాము పడగ విప్పి రెస్క్యూ టీమ్‌పై బుసులు కొడుతూ ఎదురు దాడికి దిగింది. వారినుంచి తప్పించుకోడానికి శతవిధాలా ప్రయత్నించింది. ఓ క్రమంలో అతడిని కాటేసిందేమో అనిపించింది. అయినా లెక్క చేయకుండా కోపంతో రగిలిపోతున్న ఆ కోబ్రాను ఎంతో చాకచక్యంగా పట్టేశాడు. ట్విట్టర్‌లోని @Animal_WorId అకౌంట్‌లో ఆ వీడియోని పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు పామును చూసి ఆశ్చర్యపోతున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Zodiac Signs: ఈ 6 రాశులవారు తమ తప్పుల నుంచి నేర్చుకుంటారు.! ఏయే రాశులంటే?
Viral Photo: ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!