Lakhimpur Kheri Violence: లంఖిపూర్ ఖేరీ ఘటనలో సుప్రీం సీరియస్.. ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం..

| Edited By: Anil kumar poka

Oct 08, 2021 | 7:11 PM

Supreme Court: యూపీలో జరిగిన లంఖిపూర్ ఖేరీ ఘటనపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. రైతుల మృతి కేసును సుమోటోగా తీసుకున్న దేశసర్వోన్నత న్యాయస్థానం యూపీ సర్కారు తీరును తప్పుబట్టింది...

Lakhimpur Kheri Violence: లంఖిపూర్ ఖేరీ ఘటనలో సుప్రీం సీరియస్.. ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం..
Supreme
Follow us on

యూపీలో జరిగిన లంఖిపూర్ ఖేరీ ఘటనపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. కేసు సుమోటోగా తీసుకున్న దేశసర్వోన్నత న్యాయస్థానం యూపీ సర్కారు తీరును తప్పుబట్టింది. ఆశిష్ మిశ్రాను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయాలేదని ప్రశ్నించింది. కేసును సీబీఐకు బదిలీ చేయొచ్చని యూపీ సర్కారు సుప్రీంకు తెలిపింది.

“యూపీ ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న చర్యలతో మేము సంతృప్తి చెందలేదు. బాధ్యతాయుతమైన ప్రభుత్వం, పోలీసులుగా వ్యవహరిస్తారమని మేము ఆశిస్తున్నాం” అని విచారణ సమయంలో ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. నిందితుడిని అరెస్ట్ చేయకపోవటం వల్ల “మీరు పంపుతున్న సందేశం ఏమిటి? అంటూ సుప్రీం.. యూపీ సర్కారును నిలదీసింది. దేశంలో జరుగుతున్న ఇతర హత్య కేసుల్లో నిందితులపై కూడా ఇలాంటి చర్యలే తీసుకుంటారా? అని ఆగ్రహించింది. సిట్‌లో ఉన్నవారంతా స్థానిక అధికారులే కదా.. అలాంటప్పుడు కేసు పురోగతి ఎలా ఉంటుందో అర్థమవుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

సునిశిత పరిస్థితి దృష్ట్యా ప్రస్తుతం ఎలాంటి వ్యాఖ్యలు చేయట్లేదని, దీనిపై అక్టోబరు 20న తదుపరి విచారణ చేడతామని ధర్మాసనం వెల్లడించింది. మరో దర్యాప్తు సంస్థ చేత దర్యాప్తు జరిపించాలా లేదా అన్నదానిపై కూడా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ ఘటనలో సాక్ష్యాలను భద్రంగా ఉంచాలని.. యూపీ డీజీపీకి తమ మాటగా చెప్పాలని ఆ రాష్ట్రం తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాదికి సూచించారు. మరోవైపు విచారణకు హాజరుకావాలని ఆశిష్ మిశ్రాకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ అతను పోలీసుల విచారణకు హాజరుకాలేదు. తనకు మరికొంత సమయం కావాలని కోరారు.

అక్టోబరు 3న కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి కొడుకు కారెక్కించారు. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. బీజేపీ కార్యకర్తలు సహా పలువురికి గాయాలయ్యాయి.

Read Also.. Indian – Chinese: సరిహద్దులో మరోసారి రెచ్చిపోయిన చైనా.. బుద్ధి చెప్పిన భారత ఆర్మీ..