ఈ ఏడాది ప్రారంభంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజస్థాన్ ప్రఖ్యాత భిల్వారా దేవ్ నారాయణ ఆలయాన్ని సందర్శించారు. దేవ్ నారాయణ జయంతి సందర్భంగా జనవరి 28న అక్కడకు వెళ్లిన మోడీ దేవనారాయణ దేవాలయంలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. అలాగే అక్కడున్న హుండీలో ప్రత్యేక కానుకలు కూడా సమర్పించారు. ఇది జరిగి సుమారు 8 నెలలు అవుతోంది. అయితే గత మూడు రోజులుగా ప్రధాని మోడీ, దేవ్‌నారాయాణ ఆలయాల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనికి కారణమేంటంటే.. తాజాగా ఈ దేవస్థానం హుండీని తెరవడమే. ఈ దేవాలయం హుండీని కేవలం ప్రత్యేక సందర్భాలలో మాత్రమే తెరుస్తారు. భాద్రపద మాసం (హిందూ క్యాలెండర్ ప్రకారం) ఛత్ తిథి కావడంతో సోమవారం (సెప్టెంబర్ 25)న హుండీ తెరిచారు. ఆలయ అధికారులు, పూజారులు హుండీ దేవాలయానికి వచ్చిన విరాళాలను లెక్కించారు. అయితే ఇందులో ప్రధాని మోడీ పేరుతో వచ్చిన ఓ కవరులో కేవలం 21 రూపాయలే కనిపించాయి. ఆలయ పూజారి హేమ్‌రాజ్ పోస్వాల్ స్వయంగా ఈ కవర్‌ను తెరచి చూడగా అందులో 20 రూపాయల నోటుతో పాటు ఒక రూపాయి నాణెం మాత్రమే కనిపించాయి. అంతే మోడీపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు ప్రతిపక్ష నాయకులు. ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ మోడీని దుయ్యబట్టుతున్నారు.
అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. జనవరిలో ప్రధాని మోడీ దేవ్‌నారాయణ ఆలయానికి వచ్చినప్పుడు అసలు ఎలాంటి ఎన్వలప్ కవర్‌ను హుండీలో వేయలేదు. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఇందులో ప్రధాని మోడీ కేవలం కరెన్సీ నోట్లను మాత్రమే నేరుగా హుండీలో వేయడం మనం చూడవచ్చు. అంటే ఉద్దేశపూర్వకంగానే కొందరు ప్రధాని మోడీ పేరుతో 21 రూపాయలతో ఉన్న ఎన్వలప్ కవర్‌ను హుండీలో వేశారని అర్థమవుతుంది.
गुर्जर समाज एक सीधी, सच्ची, ईमानदार, सरल एवं स्वाभिमानी कौम है और किसी कौम व समाज को इस तरह छलना अच्छी बात तो नहीं है माननीय प्रधानमंत्री श्री @narendramodi जी।
याद है ना प्रधानमंत्री मोदी जी, जब आपका देव दरबार के 1111वें प्राकट्य दिवस पर देव धाम भीलवाडा-आसींद मालासेरी डूंगरी… pic.twitter.com/Eppt7ibWbI
— Dheeraj Gurjar (@dgurjarofficial) September 25, 2023
ఇటీవల సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, ఎక్కువయ్యాయి. ముఖ్యంగా కొందరిపై బురద చల్లడానికి దీనినే ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నుంచి సామాన్యుల వరకు అందరూ బాధితులే. ఇటీవల రాహుల్‌గాంధీ, సోనియా గాంధీపై కూడా ఇలాంటి బూటకపు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రధాని మోదీ ఘటన విషయానికి వస్తే స్వయంగా ఆలయ పూజారే ఇది మోడీ పేరుతో ఉన్న కవర్ అని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ఈ వీడియో బాగా వైరలైంది. అయితే ఇది మోడీని ఇరుకున పెట్టేందుకు, కించపరిచేందుకు ఎవరో ఇలా మోడీ పేరుతో కవర్‌ను హుండీలో వేసి ఉండవచ్చు. పైగా ప్రస్తుతం ఎన్నికల రోజులు నడుస్తున్నాయి. త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అలాగే మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు షెడ్యూల్ అయ్యాయి. ఇటీవల ప్రధాని మోడీ విద్యార్హత, వైవాహిక స్థితి, బ్రాండెడ్ వాచీలు, డిజైనర్ దుస్తులపై తరచూ కొన్ని రూమర్లు వస్తున్నాయి. ఇటీవల న్యూఢిల్లీ వేదికగా జరిగిన జీ20 సదస్సు లో ప్రధాని మోడీని ప్రజెంట్ చేస్తూ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అయింది. అదే సమయంలో ఢిల్లీ మురికివాడలు, శిథిల భవాలను కనిపించకుండా కప్పి ఉంచేందుకే ఇలాంటి పెద్ద పెద్ద హోర్డింగులు ఏర్పాటుచేశారని నెట్టింట పోస్టులు దర్శనమిచ్చాయి. దీనిపై కొందరు ప్రతిపక్షనాయకులు పెద్ద రాద్ధాంతమే సృష్టించారు. అయితే ఇందులో ఏమాత్రం నిజలేదని ఫ్యాక్ట్ చెక్ టీమ్ నిర్ధారించింది.
కాగా ఇలాంటి అబద్ధపు వార్తల వల్ల పలు విపరీత పరిణామాలు సంభవించవచ్చు. గతంలో ప్రధాని మోడీ కూడా ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా ఒక వార్తను షేర్ చేసేముందు 10 సార్లు ఆలోచించాలని ఉద్ఘాటించారు. అందులో నిజమెంత ఉందో అబద్ధమెంత ఉందో ధ్రువీకరించుకోవాలని సూచించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..