
తమిళనాడులోని పుదుచ్చేరిలో ఓ నకిలీ గోల్డ్ మాఫియా గుట్టురట్టైంది. అయితే ఈ వ్యవహారం వెనుక ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ఓ ఎస్సై ఉండటం కలకలం సృష్టించింది. కొన్నాళ్లుగా సాగుతున్న ఈ మాఫియాకు పోలీసులు చెక్ పెట్టారు. పుదుచ్చేరికి చెందిన భువనేశ్వరి అనే మహిళ ఈ నకిలి దందా నడిపిస్తోంది. ఆ దందా ఏంటో తెలిస్తే మీరు నిజంగానే షాక్ అవుతారు. అదేంటంటే రాగి ఆభరణాలకు బంగారం పూత పూసి ఆ నగలతో బ్యాంక్ లు, గోల్డ్ లోన్ సంస్థల నుంచి రుణాలు తీసుకోవడమే ఈ మాఫియా పని. ఇలా దాదాపు కొన్ని బ్యాంకులు, గోల్డ్ లోన్ సంస్థల నుంచి దాదాపు 5 కోట్ల రూపాయాల వరకు ఈ ముఠా రుణాలు తీసుకొచ్చింది.
ఈ ముఠా వ్యవహారం తెలిసిన పోలీసులు నిందితుల కోసం గాలించగా కేటుగాళ్లు చిక్కనే చిక్కారు. ఇందులో ఉన్న మరో ట్విస్ట్ ఏంటంటే చిన్న చాపలకు వల వేస్తే జాక్ పాట్ లాగా పెద్ద చాప చిక్కింది. ఈ ముఠా వ్యవహారం వెనుక ఎస్సై జయరాం ఉండి ఈ దందా నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులతో పాటు ఎస్సైను సైతం అరెస్టు చేశారు. అయితే దొంగలు దొరికినప్పటికీ ఆ ముఠా చేసిన వ్యవహారంపై భయం పొనట్లు కనిపిస్తోంది. బ్యాంక్ సిబ్బంది, గోల్డ్ లోన్ ఇచ్చే సంస్థల వ్యాపారులను ఈ నకిలీ గ్యాంగ్ వ్యవహారం కలవెరపెడుతోంది. ఈ నకిలీ ముఠా చేసిన పనివల్ల ఇప్పడు తమిళనాడు, పుదుచ్చేరిలో ఇంకా ఎంత మొత్తంలో నకిలీ బంగారం బ్యాంకుల్లో ఉందోనన్న భయాలు మొదలయ్యాయి. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టడం ప్రారంభించారు. మరోవైపు నిందితులను కూడా విచారిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..