BJP Big Plan: శివరాజ్‌ను కాదని మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్.. కమలనాథుల లెక్క ఇదేనా..?

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గెలుపొందిన 3 రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ గెలుపు ప్రత్యేకం. ఇక్కడ సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్నప్పటికీ.. గతం కంటే భారీ మెజారిటీతో బీజేపీ విజయాన్ని అందుకుంది. అటూ ఇటుగా 2 దశాబ్దాలపాటు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్‌ పట్ల ప్రజల్లో వ్యతిరేకత లేదని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. అయినప్పటికీ బీజేపీ అగ్రనాయకత్వం చత్తీస్‌గఢ్ బాటలోనే మధ్యప్రదేశ్‌లోనూ ముఖ్యమంత్రిని మార్చింది.

BJP Big Plan: శివరాజ్‌ను కాదని మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్.. కమలనాథుల లెక్క ఇదేనా..?
Mohan Yadav, Shivraj Singh Chouhan
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 12, 2023 | 1:09 PM

ఈ మధ్య జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గెలుపొందిన 3 రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ గెలుపు ప్రత్యేకం. ఇక్కడ సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్నప్పటికీ.. గతం కంటే భారీ మెజారిటీతో బీజేపీ విజయాన్ని అందుకుంది. అటూ ఇటుగా 2 దశాబ్దాలపాటు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్‌ పట్ల ప్రజల్లో వ్యతిరేకత లేదని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. అయినప్పటికీ బీజేపీ అగ్రనాయకత్వం చత్తీస్‌గఢ్ బాటలోనే మధ్యప్రదేశ్‌లోనూ ముఖ్యమంత్రిని మార్చింది. ముఖ్యమంత్రి రేసులో కైలాశ్ విజయవర్గీయ, నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్ వంటి పలు పేర్లు వినిపించినప్పటికీ.. ఎవరి ఊహకు అందకుండా మోహన్ యాదవ్‌ను తెరపైకి తెచ్చింది. కమలనాథుల ఈ అనూహ్య నిర్ణయం వెనుక మతలబు ఏంటన్నదే ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

యాదవుల ఓటుపై కన్ను!

భారతీయ జనతా పార్టీ 2014 సార్వత్రిక ఎన్నికల నుంచి వరుసగా సాధిస్తున్న విజయాల వెనుక వెనుకబడిన తరగతులు (ఓబీసీ) పాత్ర అత్యంత కీలకం. స్వయానా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే ఆ సామాజికవర్గానికి చెందినవారు కావడం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇన్నాళ్లుగా నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురైన ఓబీసీ వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల ఆ వర్గం బీజేపీకి బలమైన ఓటుబ్యాంకుగా మారింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఓబీసీల్లోని ఒక వర్గం మాత్రం బీజేపీకి దూరంగా ఉంటోంది. ఆ వర్గమే ‘యాదవులు’. ఇందుక్కారణం.. ఆ వర్గం తమ సొంతం అనుకునే సమాజ్‌వాదీ (SP), రాష్ట్రీయ జనతాదళ్ (RJD) వంటి రాజకీయ పార్టీలు ఉండడమే. దీంతో యాదవేతర ఓబీసీల బలంతోనే బీజేపీ ఇంతకాలంగా రాజకీయం చేస్తూ వచ్చింది. కానీ మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలంటే బీజేపీకి దూరంగా ఉన్న ప్రతి ఒక్కరినీ ఆకట్టుకోవాల్సిందేనని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించింది.

ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్‌ను తెరపైకి తేవడంతో ఉత్తరాదిన హిందీ మాట్లాడే అన్ని రాష్ట్రాలకు ఒక బలమైన సంకేతాన్ని పంపించింది. యాదవులకు రాజ్యాధికారం కేవలం సమాజ్‌వాదీలోనే కాదు బీజేపీలోనూ సాధ్యమేనని వారిలో విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేసింది. యాదవులు ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఈ వర్గం ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా కూడా ఉన్నారు. అందుకే బీజేపీకి అనుకూలంగా ఎంత బలమైన గాలి వీచినా.. ఆ సెగ్మెంట్లలో మాత్రం విజయాన్ని అందుకోలేకపోతోంది. ఈ పరిస్థితుల్లో తాజా నిర్ణయం ప్రభావం వల్ల యాదవ ఓటుబ్యాంకు నుంచి కొంత భాగం చీలి బీజేపీకి జతకలిసినా చాలు.. ఆశించిన ఫలితాలు సాధించవచ్చని భావిస్తోంది.

చత్తీస్‌గఢ్‌లో తొలిసారి గిరిజన నేతకు ముఖ్యమంత్రి అవకాశం కల్పించిన బీజేపీ, మధ్యప్రదేశ్‌లో సీఎం పదవిని ఓబీసీ వర్గాలకే ఇవ్వాలని నిర్ణయించుకుంది. రాజకీయ విశ్లేషకులు ఈ నిర్ణయాన్ని కుల సమీకరణాల పునరుజ్జీవంగా అభివర్ణిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో ఇంతకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఓబీసీల్లోని కిరార్ సామాజికవర్గానికి చెందిన నేత. ఆయన్ను కాదని మరొకరికి అవకాశం కల్పించే క్రమంలో బీజేపీ వ్యూహాత్మకంగా ‘యాదవ’ సామాజికవర్గానికి చెందిన మోహన్ యాదవ్‌ను ఎంపిక చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌లో రాజకీయ మైలేజ్ కోసమే మధ్యప్రదేశ్‌లో యాదవ సామాజిక వర్గానికి చెందిన మోహన్ యాదవ్‌కి  సీఎం పగ్గాలు అప్పగిస్తూ బీజేపీ పెద్దలు నిర్ణయించారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

యూపీ, బిహార్ రాష్ట్రాలే కీలకం!

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా యాదవ నేత మోహన్ యాదవ్ నియాకమం.. ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌, బిహార్‌లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ ప్రభావాన్ని యాదవ సమాజంపై తగ్గించే మాస్టర్ స్ట్రోక్‌గా రాజకీయ పండితులు చెబుతున్నారు. యూపీ, బిహార్ రాష్ట్రాల్లో సమాజ్‌వాదీ, ఆర్జేడీ వంటి ప్రాంతీయ పార్టీలు ‘యాదవ్-ముస్లిం’ కాంబినేషన్‌తో రాజకీయాలు చేస్తున్నాయి. ఇదొక డెడ్లీ కాంబినేషన్‌గా ఆ పార్టీలకు చెక్కుచెదరని ఓటు బ్యాంకుగా నిలుస్తూ వస్తోంది. ట్రిపుల్ తలాఖ్ రద్దు వంటి చర్యలతో ముస్లిం ఓటుబ్యాంకులో మహిళలను కొంతమేర ఆకట్టుకోగల్గినప్పటికీ.. బీజేపీకి ముస్లింలు ఎప్పటికీ ఓటుబ్యాంకు కాలేరు. అందుకే యాదవులను తమవైపు ఆకట్టుకుంటే.. ముస్లింలు ఏ పార్టీకి కొమ్ముకాసినా సరే తమకు ఇబ్బంది ఉండదని బీజేపీ భావిస్తోంది.

కేంద్రంలో తిరుగులేని మెజారిటీతో వరుసగా రెండు పర్యాయాలు బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఉత్తర్ ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో ఆ పార్టీకి లభించిన ఆదరణ, మెజారిటీ సీట్లు కీలక భూమిక పోషించాయి. అయితే బీజేపీ ఓటమే ఏకైక లక్ష్యంగా విపక్ష పార్టీలన్నీ I.N.D.I.A పేరుతో జట్టుకట్టి బీజేపీకి సవాల్ విసురుతున్నాయి. వేదికపై నేతల చేతులు కలిసినట్టే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కూడా చేతులు కలిపి పనిచేస్తే బీజేపీ విజయావకాశాలకు గండి కొట్టే ప్రమాదం ఉంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎవరికివారుగా పోటీ చేయడంతో బీజేపీ విజయం సాధ్యపడింది. రాజస్థాన్‌లో కేవలం 2 శాతం ఓట్ల తేడాతో అధికార పీఠాన్ని చేజిక్కించుకోగలిగింది. ఒకవేళ కూటమి పొత్తులు ఇక్కడ ఫలించి, కలసికట్టుగా పనిచేస్తే కమలదళానికి ఈ విజయం సాధ్యపడేది కాదు. అందుకే కూటమి ఎత్తులను చిత్తు చేయడానికి సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తోంది. రాజకీయాల్లో పెద్దగా ప్రాతినిధ్యం, ప్రాధాన్యత లేని ఓబీసీవర్గాలను చేరదీయగల్గిన బీజేపీ, రాజకీయాల్లో అప్పటికే క్రియాశీలంగా ఉన్న ఓబీసీల్లోని ‘యాదవుల’ను కూడా చేరదీయగల్గితే ప్రతిపక్ష కూటమి వేసే ఏ ఎత్తునైనా చిత్తు చేయవచ్చని భావిస్తోంది. కేవలం ఈ చర్యతోనే యావత్ యాదవ సమాజం బీజేపీ వెంట నడుస్తుందని భావించకపోయినా.. ఎంతో కొంత ఓటుబ్యాంకును చీల్చినా సరే.. తమకు రెట్టింపు ప్రయోజనం కల్గిస్తుందని అంచనా వేస్తోంది. మరో నాలుగైదు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనుసరించే ఈ వ్యూహాలు ఎంతమేర ఫలిస్తాయి అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి

రూ.75 వేలకు చేరువలో బంగారం ధరలు..దిగి రాని వెండి
రూ.75 వేలకు చేరువలో బంగారం ధరలు..దిగి రాని వెండి
12 రాశులకు వార ఫలాలు (ఏప్రిల్ 28 నుంచి మే 4, 2024 వరకు)
12 రాశులకు వార ఫలాలు (ఏప్రిల్ 28 నుంచి మే 4, 2024 వరకు)
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో