Kerala Ex-teacher Arrest: అతనొక విద్యా బుద్ధులు నేర్పే గురువు.. కానీ తప్పటడుగులు వేశాడు.. నిత్యం కామంతో రగిలిపోతూ.. విద్యార్థులను లైంగికంగా వేధించేవాడు. ఇలా కీచక ఉపాధ్యాయుడు.. తన 30 ఏళ్ల సర్వీసులో 60 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన కేరళలోని ఓ కీచక మాజీ ఉపాధ్యాయుడి ఘోరాలు.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. 30 ఏళ్ల సర్వీసులో ఆ కీచకుడు ఏకంగా 60 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీంతోపాటు ఈ ఘటనపై విచారణ చేపట్టాలని కేరళ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఘటన మలప్పురం మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. సీపీఎం కౌన్సిలర్‌గా ఉన్న కేవీ శశికుమార్.. పట్టణంలోని సేంట్ గెమాస్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేసి 2022 మార్చిలో రిటైర్ అయ్యాడు. ఉపాధ్యాయుడిగా పనిచేసిన సమయంలో వేధింపులకు గురి చేసినట్టు శశికుమార్‌కు వ్యతిరేకంగా పోలీసు కేసు నమోదైంది. అయితే.. దాదాపు 50 మందికి పైగా కలసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు పర్యాయాలు కౌన్సిలర్‌గా పనిచేస్తుండడంతో రాజకీయ పలుకుబడిని అతడు తనకు రక్షణగా ఉపయోగించుకున్నట్లు పేర్కొంటున్నారు. అయితే.. ఇప్పటివరకు దుర్మార్గుడి అఘాయిత్యాలపై ఎవరూ ధైర్యం చేసి చెప్పలేకపోయారు.
ఈ క్రమంలో శశికుమార్ రిటైర్ అయ్యాడని ఫేస్ బుక్ ద్వారా తెలుసుకున్న ఓ మాజీ విద్యార్థిని ఒకరు అతడి లీలలను బయటపెట్టింది. మీటూ (MeToo) ఆరోపణలు చేస్తూ పలు వ్యాఖ్యలు చేయగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా.. విషయంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పలువురు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఈ ఆరోపణలు రావడంతో.. వారం రోజులుగా పరారీలో ఉన్న శశికుమార్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి విచారణకు ఆదేశించారు. ఈ పరిణామాలతో శివకుమార్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు సీపీఎం ప్రకటించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: