Cyclone Tauktae : తౌక్టే తుఫాను మృతుల కుటుంబాలకు రూ. రెండు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా, గాయపడ్డవాళ్లకి రూ. 50వేలు : ప్రధాని మోదీ

|

May 19, 2021 | 6:21 PM

PM Modi areal survey : అరేబియా తీరంలో తౌక్టే తుఫాను మిగిల్చిన విషాదాన్ని కళ్లారా చూసిన పీఎం నరేంద్ర మోదీ తుఫాను బాధితులకి ఎక్స్-గ్రేషియా ప్రకటించారు...

Cyclone Tauktae : తౌక్టే తుఫాను మృతుల కుటుంబాలకు రూ. రెండు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా, గాయపడ్డవాళ్లకి రూ. 50వేలు : ప్రధాని మోదీ
Pm Modi Areal Survey
Follow us on

PM Modi areal survey : అరేబియా తీరంలో తౌక్టే తుఫాను మిగిల్చిన విషాదాన్ని కళ్లారా చూసిన పీఎం నరేంద్ర మోదీ తుఫాను బాధితులకి ఎక్స్-గ్రేషియా ప్రకటించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ ఏరియల్ సర్వే నిర్వహించిన ప్రధాని.. తౌక్టే తుఫాను కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని తెలిపారు. తుఫాను కారణంగా క్షతగాత్రులైన వాళ్లకి ఒక్కొక్కరికి 50,000 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం ఇస్తామని తెలిపారు. బాధిత కుటుంబాలపై భారత ప్రభుత్వం పూర్తి సంఘీభావం కలిగి ఉందన్న మోదీ.. తుఫాను బాధితులందరికీ సాధ్యమైనంత సహాయాన్ని అందిస్తామని పేర్కొన్నారు. గుజ‌రాత్‌ సహా తౌక్టే తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఈరోజు ఏరియ‌ల్ స‌ర్వే నిర్వహించారు. ఉనా, డ‌యూ, జ‌ఫ‌రాబాద్‌, మ‌హువాలో స‌ర్వే చేసిన అనంతరం మోదీ అధికారుల‌తో స‌మీక్ష‌ జరిపారు. కాగా, అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాను బీభ‌త్సం సృష్టించిన సంగతి తెలిసిందే. తుఫాను ప్రభావంతో కేరళ, కర్నాటక, గోవా, గుజరాత్​లలో కుండపోత వానలు కురిశాయి.

మహారాష్ట్ర, గుజరాత్ సహా పలు రాష్ట్రాలను గడగడలాడించిన అతి భీకర తౌక్టే తుఫాన్ క్రమంగా బలహీనపడి ప్రస్తుతం వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తొలుత అతిభీకర తుపానుగా రూపాంతరం చెందిన తౌక్టే తుఫాన్ సోమవారం అర్ధరాత్రి తర్వాత 1.30 గంటలకు గుజరాత్​లోని దీవ్, ఉనాల మధ్య తీరం దాటిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో గుజరాత్ చిగురుటాకులా వణికిపోయింది. తుఫాన్ వలన కురిసిన వర్షాలు, గాలుల ప్రభావంతో వివిధ ఘటనల్లో 45 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆయా ప్రాంతాల్ని ప్రధాని మోదీ క్షేత్రస్థాయిలో ఇవాళ పరిశీలించారు.

Read also : Black Fungus : బ్లాక్ ఫంగస్ లక్షణాలేంటి.. ఎవరెవరికి.. ఎక్కడెక్కడ వ్యాపిస్తుంది..? పూర్తి వివరాలు అందించిన స్టేట్ నోడల్ ఆఫీసర్