న్యూఢిల్లీ, జనవరి 3: గడచిన పదేళ్లలో దేశంలో ఉపాధి అవకాశాలు 36 శాతం పెరిందని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా గురువారం తెలిపారు. మోదీ హాయంలో నిరుద్యోగం గణనీయంగా తగ్గినట్లు ఆయన తెలిపారు. 2014-15లో 47.15 కోట్లు ఉండగా 2023-24 నాటికి 36 శాతం పెరిగి 64.33 కోట్ల ఆయాదం పెరిగిందని వెల్లడించింది. ఇది ఎన్‌డీఏ హయాంలో ఉద్యోగాల కల్పనలో మెరుగుదలను చూపుతుందని అన్నారు. ఈ మేరకు గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ..
2004 నుంచి 2014 మధ్య యుపీఏ హయాంలో ఉపాధి కేవలం 7 శాతం మాత్రమే పెరిగిందని, ఈ టైంలో కేవలం 2.9 కోట్ల అదనపు ఉద్యోగాలు కల్పించింనీ.. అదే 2014-24 మధ్య కాలంలో మోదీ హయాంలో ఏకంగా 17.19 కోట్ల ఉద్యోగాలు పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు. గత ఏడాది (2023-24)లోనే మోదీ ప్రభుత్వం దేశంలో దాదాపు 4.6 కోట్ల ఉద్యోగాలను సృష్టించిందని మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. వ్యవసాయ రంగం గురించి మంత్రి మాట్లాడుతూ, యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 మధ్య కాలంలో ఉపాధి 16 శాతం తగ్గిందని, మోదీ హయాంలో 2014-2023 మధ్య 19 శాతం వృద్ధి చెందిందని పేర్కొన్నారు. అదేవిధంగా, యుపీఏ హయాంలో 2004 నుంచి 2014 మధ్యకాలంలో తయారీ రంగంలో ఉపాధి కేవలం 6 శాతం మాత్రమే పెరిగిందని, మోడీ హయాంలో 2014-2023 మధ్య 15 శాతం పెరిగిందని అన్నారు.
ఇక సేవా రంగంలో యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 మధ్య ఉపాధి 25 శాతం పెరగగా.. మోదీ హయాంలో 2014-2023 మధ్య 36 శాతం పెరిగిందని ఆయన వివరించారు. నిరుద్యోగిత రేటు 2017-18లో 6 శాతం నుంచి 2023-24లో 3.2 శాతానికి తగ్గిందని స్పష్టం చేశారు. ఉపాధి రేటు 2017-18లో 46.8 శాతం నుంచి 2023లో 58.2 శాతానికి పెరిగింది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు 2017-18లో 49.8 శాతం నుంచి 2023-24లో 60.1 శాతానికి పెరిగింది. EPFO పెరుగుదల గురించి మంత్రి మాట్లాడుతూ.. గత ఏడేళ్లలో (సెప్టెంబర్ 2017- సెప్టెంబర్ 2024 మధ్య) 4.7 కోట్ల మంది 18 నుంచి 28 ఏళ్ల వయసు కలిగిన యువత EPFOలో చేరారని అన్నారు.