AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రసిద్ధ ఆలయం.. గుడిమెట్లు ఎక్కిన ఏనుగు..వీడియో వైరల్

ఓ ఏనుగు అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతుండగా చూసిన కొందరు స్థానికులు ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది...

ప్రసిద్ధ ఆలయం.. గుడిమెట్లు ఎక్కిన ఏనుగు..వీడియో వైరల్
Jyothi Gadda
|

Updated on: Jul 04, 2020 | 7:03 PM

Share

ఏమో గుర్రం ఎగరావొచ్చు అన్నట్టుగా..ఓ ఏనుగు ఏకంగా మెట్లెకేస్తోంది. అది కూడా ఏ సాధారణమైన మెట్లు కాదు.. ఓ అమ్మవారి ఆలయం గుడి మెట్లు. ఏనుగు గుడి మెట్లు ఎక్కుతుండగా చూసిన కొందరు స్థానికులు ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. రామ్‌న‌గ‌ర్ ఫారెస్ట్ డివిజ‌న్‌లోని కార్బెట్ టైగ‌ర్ రిజ‌ర్వ్ స‌మీపంలో ఈ ఘటన వెలుగు చూసింది. కార్బెట్ టైగ‌ర్ రిజ‌ర్వ్ స‌మీపంలో ఉన్న ప్ర‌సిద్ధి చెందిన గార్జియా దేవి ఆల‌యం మెట్లు ఎక్కుతున్న ఏనుగు వీడియో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతుంది. జూన్ 28న అక్కడి సీసీటీవీలో ప‌ట్టుబ‌డింది.

అయితే, ఇక్కడి గార్జియా దేవి ఆల‌యం స్థానికంగా చాలా ప్రసిద్ధి చెందినగా తెలుస్తోంది. కాగా, ఇక్క‌డికి వచ్చే భక్తులు, ప్ర‌యాణికుల తాకిడి ఎక్కువ‌గా ఉండ‌డంతో చుట్టుప‌క్క‌ల ఉన్న ఏనుగుల‌కు కూడా ఆహారం బాగా దొరికేది. క‌రోనా, లాక్‌డౌన్ కారణంగా గుడి త‌లుపులు మూత‌ప‌డ్డాయి. ప్ర‌యాణికుల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఇక్కడి ఏనుగులకు ఆహారం దొరకకుండా పోయింది. ఆకలి తీర్చుకోవటం కోసమే గుడిలో ఏమైనా దొరుకుతుందనే ఆశతోనే ఆ ఏనుగు గుడి మెట్లు ఎక్కి ఉండవచ్చని అక్కడి ఫారెస్ట్ రేంజ్ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఏనుగులకు కూడి భగవంతుడిపై భక్తి ఎక్కువగానే ఉంటుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.