PM Modi: పంజాబ్‌ ఎన్నికలపై బీజేపీ ఫుల్‌ ఫోకస్.. రాష్ట్ర పర్యటనకు ప్రధాని మోదీ

|

Jan 05, 2022 | 11:23 AM

Punjab Elections 2022: పంజాబ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రంపై ఫోకస్‌ పెట్టింది బీజేపీ. సాగు చట్టాల రద్దు తర్వాత తొలిసారి ప్రధాని పంజాబ్‌కు వెళుతుండడంతో ఈ టూర్‌పై ఆసక్తి నెలకొంది.

PM Modi: పంజాబ్‌ ఎన్నికలపై బీజేపీ ఫుల్‌ ఫోకస్.. రాష్ట్ర పర్యటనకు ప్రధాని మోదీ
Pm Modi
Follow us on

పంజాబ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రంపై ఫోకస్‌ పెట్టింది బీజేపీ. సాగు చట్టాల రద్దు తర్వాత తొలిసారి ప్రధాని పంజాబ్‌కు వెళుతుండడంతో ఈ టూర్‌పై ఆసక్తి నెలకొంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో ఎలాగైనా పాగా వెయ్యాలని ప్లాన్‌ చేస్తోంది బీజేపీ. అందుకు అనుగుణంగానే సాగు చట్టాలను రద్దు చేసినట్టు విశ్లేషణలు కూడా వినిపించాయి. ఏది ఏమైనా, చట్టాలు రద్దు కావడంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ(బుధవారం) పంజాబ్‌ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. వ్యవ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దుచేసిన త‌ర్వాత ప్రధాని మోదీ పంజాబ్‌లో ప‌ర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. రెండేళ్ల తర్వాత తొలిసారిగా ప్రధాని ఆ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు.

ప్రధాని మోడీ పంజాబ్ రాష్ట్ర ప‌ర్యట‌న నేప‌థ్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. పంజాబ్ బీజేపీ వ్యవ‌హారాల ఇన్‌చార్జి గ‌జేంద్రసింగ్ షెకావ‌త్ ఏర్పాట్లను ద‌గ్గరుండి ప‌ర్యవేక్షించారు. ఇటీవ‌లే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రాణా గుర్మీత్ సోధీ కూడా ఏర్పాట్లలో సహకరించారు. ప్రధాని స‌భ జ‌రుగ‌నున్న ఫిరోజ్‌పూర్‌ జ‌నాభాలో దాదాపు 70 శాతం మంది హిందువులే. దాంతో ఆ ప‌ట్టణం మొత్తం ప్రధాని బ్యానర్లు వెలిశాయి. అటు స‌భా ప్రాంగ‌ణం మొత్తం కాషాయం, ఆకుప‌చ్చ రంగు బ్యాన‌ర్లతో నిండిపోయింది.

ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి విమానంలో భ‌టిండాకు చేరుకంటారు. అక్కడి నుంచి హెలిక్యాప్టర్‌లో ఫిరోజ్‌పూర్‌కు వెళ్తారు పీఎం. అనంత‌రం హుస్సేనీవాలా స‌రిహ‌ద్దుల్లోని జాతీయ అమ‌రువీరుల స్మార‌కం వ‌ద్దకు ప్రధాని చేరుకుంటారు. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులైన‌ భ‌గత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ‌దేవ్ స‌మాధుల వ‌ద్ద నివాళుల‌ర్పించ‌నున్నారు ప్రధాని మోదీ. 2015లో అక్కడ ప‌ర్యటించిన‌ప్పుడు కూడా అమ‌ర‌వీరుల‌కు నివాళుల‌ర్పించారు ప్రధాని మోదీ. అయితే, ఈ పర్యటనపై ఆసక్తిగా చూస్తున్నారు పంజాబ్‌ ప్రజలు. మోదీ ఏం మాట్లాడబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది.

ప్రధాని మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ కొన్ని రైతు సంఘాలు పంజాబ్‌లో ఆందోళన చేపడుతున్నాయి.

Also Read..

Cow Milk: ఆవు పాలు లేత పసుపు రంగులో.. గేదె పాలు తెల్లగా ఎందుకుంటాయి..?

Omicron Effect on Doctors: ఒమిక్రాన్ బారిన పడుతున్న వైద్యులు.. అదే జరిగితే పరిస్థితి ఏంటని ఆందోళన..!