బ్రేకింగ్ న్యూస్: మార్చి 26న రాజ్యసభ ఎన్నికలు
దేశంలో మరోసారి ఎన్నికల నగరా మోగింది. మార్చి 26న రాజ్యసభ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 15 రాష్ట్రాల్లో 55 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్..
దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. మార్చి 26న రాజ్యసభ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 15 రాష్ట్రాల్లో 55 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో 4, తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
షెడ్యూల్ వివరాలు:
1. మార్చి 6న నోటిఫికేషన్ 2. మార్చి 13 నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు 3. మార్చి 16న రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన 4. మార్చి 18న నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు
కాగా తెలంగాణ నుంచి కేవీపీ, గరికపాటి మోహన్ రావుల పదవీ కాలం ముగియనుంది. అటు ఏపీలో కే కేశవరావు, తోట సీతారామలక్ష్మి, సుబ్బిరామి రెడ్డి, ఏకే ఖాన్‌ల స్థానాలు ఖాళీకానున్నాయి. దీంతో ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే ఏపీలో ఒక స్థానాన్ని.. బీజేపీకి ఇస్తారా.. లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇటు తెలంగాణలో కూడా రాజ్యసభ పదవి ఎవరికి దక్కుతుందోనని సందిగ్ధత నెలకొంది. కాగా.. 15 రాష్ట్రాల్లో 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 26వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది.