Watch Video: కదులుతున్న బస్సులో నుంచి పడిపోయిన మహిళ.. ఆ తర్వాత జరిగిందిదే! వీడియో వైరల్
కదులుతున్న ఆర్టీసీ బస్సులో నుంచి ఓ మహిళ ప్రమాదవశాత్తూ కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన త్రిసూర్ జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం..

త్రిసూర్, ఆగస్టు 9: ఓ వృద్ధ మహిళ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు ఎక్కింది. అనంతరం బస్సు ముందుకు కదిలింది. అయితే బస్సులోపల ఖాళీగా ఉన్న సీటు కోసం ముందుకు నడుచుకుంటూ వెళ్తున్న సదరు మహిళ ఉన్నట్లుండి పట్టుతప్పి బస్సు డోర్ నుంచి బయటపడిపోయింది. ఈ షాకింగ్ ఘటన కేరళలోని త్రిసూర్‌లో సోమవారం (ఆగస్ట్ 11) చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..
కేరళలోని త్రిసూర్‌లో ఓ మహిళ (74) బస్సు ఎక్కింది. ఇంతలో కండక్టర్ ఆమెవైపు వచ్చి సీటు ఖాళీగా ఉందని అక్కడకు వెళ్లి కూర్చోమని చెప్పడం వీడియోలో కనిపిస్తుంది. దీంతో ఆమె కూర్చునేందుకు వెళ్తుండగా బస్సు కుదుపులకు అదుపుతప్పి బస్సు డోర్‌లో నుంచి ఒక్కసారిగా బయటకు పడిపోయింది. ఈ ప్రమాదంలో సదరు మహిళ ప్రాణాలు అక్కడికక్కడే కోల్పోయింది. రెప్పపాటులో జరిగిన ఈ ఘటనతో బస్సులోని వారంతా షాక్‌కు గురయ్యారు. మహిళ బస్సులో నుంచి బయటకు పడే సమయంలో కండక్టర్ ఆమెను పట్టుకునేందుకు ముందుకు పరిగెత్తాడు. కానీ అప్పటికే ఆలస్యమైంది.
கேரளா – திருச்சூர் : ஓடும் பேருந்தில் இருந்து தவறி விழுந்த நளினி(74) என்ற மூதாட்டி மரணம்.
பயணம் செய்யும் போது காலியாக இருந்த இருக்கையைக் கண்டு உட்கார பின்னால் சென்று தவறி கீழே விழுந்தார்.#kerala #Thrissur #Bus #Accident pic.twitter.com/E5DCkOxirF
— Kᴀʙᴇᴇʀ – தக்கலை கபீர் (@Autokabeer) August 12, 2025
కండక్టర్ వెంటనే బస్సును ఆపి బాధిత మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




