Car Caught Fire: కారులో మంటలు.. తన కాన్వాయ్‌ని ఆపి బాధితులకు సీఎం పరామర్శ.. ఆదుకుంటానని హామీ.. వీడియో వైరల్

|

Sep 13, 2022 | 3:33 PM

Car Caught Fire: సాధారణంగా కార్లలో అప్పుడప్పుడు మంటలు చెలరేగుతుంటాయి. ఎక్కువగా జాతీయ రహదారులపై ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. షార్ట్‌సర్య్కూట్‌ వల్లనో..

Car Caught Fire: కారులో మంటలు.. తన కాన్వాయ్‌ని ఆపి బాధితులకు సీఎం పరామర్శ.. ఆదుకుంటానని హామీ.. వీడియో వైరల్
Eknath Shinde
Follow us on

Car Caught Fire: సాధారణంగా కార్లలో అప్పుడప్పుడు మంటలు చెలరేగుతుంటాయి. ఎక్కువగా జాతీయ రహదారులపై ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. షార్ట్‌సర్య్కూట్‌ వల్లనో, మరేదైన కారణంగా కార్లలో మంటలు చెలరేగుతుంటాయి. గత రాత్రి ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై లగ్జరి కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే.. కాలిపోతున్న కారును చూసిన తన కాన్వాయ్‌ను ఆపి బాధితులను పరామర్శించారు. బాధితులకు సీఎం ధైర్యం చెప్పారు.

అనంతరం మంటల్లో చిక్కుకుని బయటపడిన కారు డ్రైవర్‌ విక్రాంత్‌ తో సీఎం మాట్లాడారు. బాధితులకు ప్రభుత్వ పరంగా సాయం అందిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు డ్రైవర్‌ తెలిపారు. ఈ ఘటన సోమవారం అర్థరాత్రి సమయంలో చోటు చేసుకుంది. సీఎం తమను పరామర్శించి ఆదుకుంటానని హామీ ఇవ్వడంపై బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

 


ప్రమాద విషయాన్ని అగ్నిమాపక సిబ్బందికి తెలుపడంతో వారు హుటాహుటిన రెండు ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి