NIA: ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. జమ్మూకాశ్మీర్‌లో మరో 8 మందిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ.. పది రోజుల్లో..

Eight terror operatives arrested: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టేందుకు ఎన్ఐఏ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే జమ్మూకాశ్మీర్లోని పలు కీలక

NIA: ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. జమ్మూకాశ్మీర్‌లో మరో 8 మందిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ.. పది రోజుల్లో..
Nia
Follow us

|

Updated on: Oct 23, 2021 | 7:12 AM

Eight terror operatives arrested: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టేందుకు ఎన్ఐఏ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే జమ్మూకాశ్మీర్లోని పలు కీలక ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాన ఉగ్రసంస్థలకు చెందిన ఉగ్రవాదులను అరెస్టు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని నిన్న ఆరు జిల్లాల్లో విస్తృతంగా జరిపిన సోదాల్లో ఎనిమిది మంది నిషేధిత ఉగ్రవాద సంస్థల సభ్యులను అరెస్టు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) వెల్లడించింది. శ్రీనగర్, కుల్గాం, షోపియాన్, పుల్వామా, అనంత్‌నాగ్, బారాముల్లా జిల్లాల్లోని 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఈ సందర్భంగా ఉగ్రవాద సభ్యుల నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నామని, ‘జిహాదీ’కి సంబంధిచిన పత్రాలు, పోస్టర్లను కూడా లభించినట్లు ఏజెన్సీ అధికారి తెలిపారు.

ఉగ్రవాద కుట్ర సంబంధించి ఎన్ఐఏ అక్టోబర్ 10న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్‌తోపాటు దేశంలోని పలు కీలక ప్రాంతాల్లో దాడులు నిర్వహించి ఇప్పటివరకు మొత్తం 21 మంది నిందితులను అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేసిన అధికారులు.. తాజాగా మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వ్యక్తులు శ్రీనగర్‌కు చెందిన ఆదిల్ అహ్మద్ వార్, మనన్ గుల్జార్ దార్, శోభియా, జమీన్ ఆదిల్, కుప్వారాకు చెందిన హిలాల్ అహ్మద్ దార్, షకీబ్ బషీర్, అనంతనాగ్‌కు చెందిన రౌఫ్ భట్, హరీస్ నిసార్ లాంగూగా అధికారులు గుర్తించారు. అరెస్టయిన ఎనిమిది మంది నిందితులు వివిధ నిషేధిత ఉగ్రవాద సంస్థలకు చెందిన తీవ్రవాదులని.. వీరంతా ఉగ్రకార్యకలాపాలకు లాజిస్టికల్, మెటీరియల్ మద్దతు అందించడంలో కీలక పాత్ర పోషించారని ఎన్ఐఏ అధికారి తెలిపారు.

నిషేధిత ఉగ్రవాద సంస్థలైన లష్కరే-ఎ-తోయిబా (లెట్), జైష్-ఎ-మహ్మద్ (జెఎమ్), హిజ్బ్-ఉల్-ముజాహిదీన్ (హెచ్‌ఎమ్) అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న వీరంతా.. జమ్మూకాశ్మీర్, ఇతర ప్రధాన నగరాల్లో కుట్రకు ప్రణాళికలు రచించినట్లు తెలిపారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని.. తెలిపారు.

కాగా.. ఈ కేసు దర్యాప్తు అనంతరం అక్టోబరు 13న కాశ్మీర్‌లోని వివిధ జిల్లాల్లోని 18 ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో తొమ్మిది మంది తీవ్రవాద సహచరులను అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఏ తెలిపింది.

Also Read:

DRDO Abhyas: లక్ష్యం వైపు దూసుకెళ్లిన ‘అభ్యాస్’.. డీఆర్డీవో పరీక్ష విజయవంతం..

Andhra Pradesh, Telangana News: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి టాప్-9 వార్తలు ఇవే..