8 మంది రాజ్యసభ సభ్యులకూ కరోనా పాజిటివ్

రాజ్యసభ ఎంపీలుగా ఉన్నవారిలో 8 మందికి కరోనా పాజిటివ్ సోకింది. ఇప్పటికే లోక్ సభ సభ్యులైన 17 మంది ఈ ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. ఎంపీల్లో ఒకరైన మీనాక్షి లేఖి ట్వీట్ చేస్తూ..

8 మంది రాజ్యసభ సభ్యులకూ కరోనా పాజిటివ్
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 14, 2020 | 5:40 PM

రాజ్యసభ ఎంపీలుగా ఉన్నవారిలో 8 మందికి కరోనా పాజిటివ్ సోకింది. ఇప్పటికే లోక్ సభ సభ్యులైన 17 మంది ఈ ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. ఎంపీల్లో ఒకరైన మీనాక్షి లేఖి ట్వీట్ చేస్తూ.. పార్లమెంట్ హౌస్ లో నిర్వహించిన రొటీన్ టెస్ట్ లో తనకు పాజిటివ్ అని తేలిందని, కానీ తాను ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. తనతో ఇటీవల కాంటాక్ట్ లో ఉన్నవారు కరోనా టెస్ట్ చేయించుకోవాలని లేఖి కోరారు. ఏమైనా అంతా కలిసి కరోనాను ఓడిద్దామని పేర్కొన్నారు.

785 మంది ఎంపీల్లో సుమారు 200 మంది 65 ఏళ్ళు పైబడినవారే ! ఈ మధ్య ఏడుగురు కేంద్ర మంత్రులు, 25 మంది పార్లమెంట్ సభ్యులు ఈ వైరస్ కి గురయ్యారు. ఎమ్మెల్యేలలో పలువురు మృత్యువాత పడ్డారు.