వచ్చే మార్చి నాటికి దేశ వ్యాప్తంగా ‘వన్ నేషన్-వన్ రేషన్’
వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు దేశ వ్యాప్తంగా 'వన్ నేషన్ - వన్ రేషన్' ప్రణాళిక అమలులోకి తేవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. తమ ప్రభుత్వ అత్యంత ప్రాథమ్యాల్లో ఈ పథకం ఒకటని వెల్లడించింది. ఈ పథకం అమలులోకి వస్తే దేశ వ్యాప్తంగా..
వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు దేశ వ్యాప్తంగా ‘వన్ నేషన్ - వన్ రేషన్’ ప్రణాళిక అమలులోకి తేవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. తమ ప్రభుత్వ అత్యంత ప్రాథమ్యాల్లో ఈ పథకం ఒకటని వెల్లడించింది. ఈ పథకం అమలులోకి వస్తే దేశ వ్యాప్తంగా ఆహార భద్రతా చట్టంలో భాగంగా అర్హులైన రేషన్ కార్డు దారులు ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చని కేంద్ర ఆహార వ్యవహార శాఖ వెల్లడించింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ పథకం అమలవుతుందన్నారు. దేశంలో ఎక్కడున్నా ఎవరైనా రేషన్ తీసుకోవచ్చు. ఇప్పటికే ఈ పథకాన్ని 83 శాతం అమలు చేశామని, వచ్ఛే ఏడాది మార్చి నాటికి 100 శాతం అమలు చేస్తామని పేర్కొంది. ఈ పథకంలో భాగంగా రేషన్ కార్డు కలిగిన వారికి ప్రతీనెల 5 కిలీఓల ఆహార ధాన్యాలు లభిస్తాయని, దీని వల్ల దేశంలోని 80 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని వెల్లడించింది. ముఖ్యంగా పట్టణ పేదలు, లేబర్ కార్మికులు తదితరులకు దీనివల్ల ప్రయోజనం కలుగుతుందని తెలిపింది కేంద్ర ప్రభుత్వం.
Read More: