Attention! యూజీసీ కొత్త ప్రతిపాదనలను విద్యావేత్తలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? కార్పొరేట్లకు రెడ్‌ కార్పెట్ వేయడానికేనా?

కేంద్ర బడ్జెట్‌ 2022లో భాగంగా రూపొందించిన యూజీసీ నూతన సంస్కరణలు ఏ ఏడాది మార్చి నుంచి దేశ వ్యాప్తంగా పలు స్కూళ్లు, యూనివర్సిటీల్లో అమల్లోకి రానున్నాయి. ఇది ఎంతటి పెను విపత్తును మోసుకొస్తుందో విద్యావేత్తల మాటల్లోనే..

Attention! యూజీసీ కొత్త ప్రతిపాదనలను విద్యావేత్తలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? కార్పొరేట్లకు రెడ్‌ కార్పెట్ వేయడానికేనా?
Higher Education
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 26, 2022 | 4:45 PM

UGC Reforms 2022 Know what Academics says about these: రాబోయే నెలల్లో విద్యారంగంలో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి. అందుకనుగుణంగా కేంద్ర విద్యాశాఖ (Ministry of Education) ఇప్పటికే పలు కార్యక్రమాలను రూపొందించి రంగం సిద్ధం చేసింది కూడా. ఈ కార్యక్రమాలన్నీ మార్చి నుంచి దేశ వ్యాప్తంగా అన్ని పాఠశాలు, యూనివర్సిటీల్లో అమలులోకి రానున్నాయి. 2035 నాటికి మొత్తం గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియోని 50 శాతానికి మెరుగుపరచాలనే దృష్టితో వీటిని ప్రారంభిస్తున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఈ థీమ్‌కు అనుగుణంగానే.. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (UGC) కూడా 2020 రెగ్యులేషన్ల సవరణల ద్వారా కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఐతే ఈ ప్రతిపాదనలను విద్యావేత్తలు (Higher Education) తీవ్రంగా దుయ్యబడుతున్నారు. ఆ ప్రతిపాదనలు ఏమిటో.. అవి ఎందుకు విమర్శలకు గురౌతున్నాయో.. ఆ వివరాలు సవివరంగా తెలుసుకుందాం..

  • 900 అలానమస్‌ కాలేజీల్లో ఆన్‌లైన్ డిగ్రీ కోర్సులకు అనుమతులు

అధిక కట్-ఆఫ్‌ల కారణంగా నేరుగా ఆయా కాలేజీల్లో సీటు పొందలేని విద్యార్థులకు ఇది ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందని యూసీజీ ప్రతిపాదన. దీనికనుగుణంగా ఈ ఏడాది (2022) జూలై నుంచి దేశవ్యాప్తంగా ఈ 900ల కాలేజీలు రిమోట్‌ కోర్సులను అందించడానికి అనుమతులు జారీ చేస్తోంది. కాగా ఇప్పటివరకు యూనివర్సిటీలకు మాత్రమే ఆన్‌లైన్ డిగ్రీలు అందించడానికి అనుమతి ఉంది. ఐతే ఈ కొత్త ప్రతిపాదనతో వర్చువల్ పద్ధతిలో డిగ్రీలను అందించడానికి కాలేజీలకు కూడా అవకాశం లభిస్తోంది. దేశంలో సుమారు 900 అటానమస్‌ కాలేజీలు ఆన్‌లైన్‌ కోర్సులు అందించడానికి, వాటికి సంబంధించిన డిగ్రీలు ప్రధానం చేయడానికి అర్హతలుగా.. సంబంధిత సబ్జెక్ట్ కేటగిరీల్లో నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) మూడు ర్యాంకింగ్స్‌లో రెండుసార్లు టాప్ 100లో నిలిచి ఉండాలి లేదా యూజీసీ ఆమోదంలేకుండానే న్యాక్‌ (NAAC) చేత కనీసం 3.26 గ్రేడ్‌లను కలిగి ఉన్న కాలేజీలకు ఆన్‌లైన్ డిగ్రీ కోర్సులు అందించడానికి అనుమతి ఇవ్వనుంది.

ఇప్పటికే కొన్ని కాలేజీలు ఈ విధానాన్ని అమలుచేస్తున్నాయి కూడా. మార్చి చివరినాటికి ఈ విధమైన రెగ్యులేషన్స్‌, రిలేషన్స్‌ మరిన్ని తీసుకొస్తామని యూజీసీ ఛైర్మన్ ఎమ్‌ జగదీష్ కుమార్ ప్రకటించారు. కాగా నేషనల్‌ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రధాన సంస్కరణల్లో భాగంగా 2035 నాటికి జాతీయ స్థాయిలో 50 శాతం గ్రాస్‌ ఎల్‌రోల్‌మెంట్‌ సాధించాలనే లక్ష్యంతోనే ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ సెక్టార్‌ను ప్రారంభించింది. ఇక ఈ ఆన్‌లైన్ ప్రోగ్రాములకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు కటాఫ్ తేదీ అంటూ ఏమీ ఉండదు. 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులెవరరైనా తమకు కావలసిన ప్రోగ్రామ్‌లో నేరుగా ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌కు ఆన్‌విద్య ఏవిధంగా సమానమౌతుంది?.. విద్యావేత్తల విమర్శలు

ఆన్‌లైన్ లెర్నింగ్‌పై ఎక్కువ పోకస్‌ పెట్టడంవల్ల డిగ్రీ కోర్సుల ప్రాక్టికాలిటీ దెబ్బతింటుందనేది విద్యావేత్తల వాదన. ఢిల్లీలోని మిరాండా హౌస్‌కు చెందిన ప్రొఫెసర్ అభా దేవ్ హబీబ్ దీనిని బూటకపు చర్యగా వ్యాఖ్యానించారు. దూర విద్య (Distance Education) అనేది మంచి ఆలోచనే. కానీ దానిని కాలేజీల్లోని ఫిజికల్‌ డిగ్రీలతో పోల్చలేము. గతంలో విద్యార్థులు పలు ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవడానికి ఆన్‌లైన్ డిగ్రీలను ఎంచుకునేవారు. కానీ నేడు ప్రభుత్వమే వర్చువల్ డిగ్రీలకు అధికారికంగా అనుమతినిస్తోంది. ఇది ఫిజికల్‌ ఎన్విరాన్‌మెంట్‌కు ఏవిధంగా సరిసమానమౌతుంది? అంతేకాదు ఆన్‌లైన్‌ డిగ్రీల వల్ల విద్యార్ధులకు మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుందని ప్రొఫెసర్‌ అభిప్రాయపడ్డారు.

హన్స్‌రాజ్ కాలేజీ లెక్చరర్ మాన్సి అరోరా కూడా ఈ వాదనతో అంగీకరించారు. ‘డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ను వెనుక సీటుకు తోసేస్తుంది. విద్యార్ధులు కేవలం ఉద్యోగాలు సంపాధించడానికి మాత్రమే మేము చదువులు చెప్పడం లేదు. విద్య అనేది అంతకు మించిన ప్రయోజనాన్ని ఇస్తుంది. విలువలు, నీతి సూత్రాలు, సిద్ధాంతాలు, ఆచరణాత్మక జ్ఞానం వంటి ఎన్నో విలువైన విషయాలు ఆన్‌లైన్‌ విద్య బోధించదు. విద్యనభ్యసించడానికంటే కూడా కేవలం డిగ్రీలు పొందడం పైనే ఎక్కువ ఆసక్తి కనబరిచే వాళ్లకు రిజర్వేషన్లు ఉన్నాయని అన్నారు. మన దేశంలో నచ్చిన కోర్సును ఎంచుకుని, చదివే అవకాశం ప్రతి ఒక్క విద్యార్ధికి ఉంది. అందుకు స్పెషలైజేషన్‌ అనే భావన ఏమీలేదు. పాశ్చాత్య దేశాల్లో కూడా గ్రాడ్యుయేషన్‌, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది అత్యంత ప్రత్యేకమైన కోర్సులుగా భావిస్తారు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు మాత్రమే ఆయా కోర్సులను అభ్యసిస్తారు. అంతేకాని అందరికి ఉచితంగా అందుబాటులో ఉంచలేదు. క్లాస్‌ రూం విద్య నభ్యసించిన విద్యార్ధులు మాత్రమే పోటీ పరీక్షల్లో ఎదరయ్యే గట్టి పోటీని ఎదుర్కొని నిలదొక్కుకోగలుగుతారని ఆమె అన్నారు.

  • ఇ-కోర్సులను అభివృద్ధి చేయడానికి ఎడ్-టెక్‌తో టై అప్

యూజీసీ మరో సంస్కరణ ఏంటంటే.. ఈ- కోర్సులను అభివృద్ధి చేయడానికి ఎడ్ టెక్‌తో టైఅప్‌ కావడం. దీని ద్వారా ఆన్‌లైన్‌ కోర్సులకు సంబంధించిన మెటీరియల్‌ను తయారు చేయడానికి, ఆన్‌లైన్‌ యూజీ, పీజీ డిగ్రీలను విద్యార్ధులకు అందించడానికి, అంతేకాకుండా ఈ విషయంలో స్కూళ్లు, యూనివర్సిటీలకు మరింత స్వేచ్ఛనివ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో వేగంగా పెరుగుతున్న విద్యావసరాలకు సాంకేతికతను ఉపయోగించనున్నారు.

ఉన్నత విద్యలో నాణ్యత, శ్రేష్ఠతకు పెనుగండంగా కొత్త విద్యా విధానం.. ఈ కొత్త పద్ధతితో ఎడ్ టెక్‌ రంగం సంతోషంగా ఉన్నప్పటికీ, విద్యను మెరుగుపరచడానికి ఉపాధ్యాయులు కార్పొరేట్ రంగంపై మరింత ఎక్కువగా ఆధారపడవల్సి ఉంటుంది. అనేక సవాళ్లు ఎదురౌతాయి. విద్యారంగంలో ఎడ్-టెక్ భాగస్వామ్యాన్ని ఎవరు కాదనలేరు, ఐతే విద్యాసంస్థ కంటే ఇది గొప్పదేం కాదు. ఈ ప్రతిపాదనల వల్ల విద్యను మరింత ప్రైవేటీకరించడం అవుతుంది. అంతేకాదు ఇది విద్యార్ధుల్లో డిజిటల్‌ డివైడ్‌ను మరింత పెంచబోతోందని డీపీఎస్‌ ప్రిన్సిపాల్‌ ఉషా జోషి తెలిపారు. ఈ విధానం ఉన్నత విద్యలో నాణ్యత, శ్రేష్ఠతను కూడా ప్రభావితం చేస్తుంది. ఇందుకు ఉన్నత విద్యా సంస్థల (HEls) నాణ్యతను స్థిరంగా పెంచడానికి యూజీసీ క్వాలిటీ మ్యాన్‌డేట్‌ ను ప్రారంభించింది. హై క్వాలిటీ రీసెర్చ్‌ను పోత్సహించడం, అధ్యాపకుల చేత కొత్త పరిజ్ఞానాన్ని సృష్టించడం, అకడమిక్‌ రీసెర్చ్‌ అండ్ ఎథిక్స్‌ (CARE) స్థాపన దిశగా ముందుకుసాగుతోంది. దీని ప్రధాన లక్ష్యం.. దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో రీసెర్చ్‌ క్వాలిటీని మెరుగుపరచడం, విద్యా మరియు పరిశోధన సమగ్రతను, ప్రచురణ నైతికతను ప్రోత్సహించడం.

  • ఏబీసీ పథకం

అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ABC)ని కూడా యూజీసీ ఈ ఏడాది ప్రారంభిస్తోంది. ఇది ఉన్నత విద్యా సంస్థల్లో చేరిన విద్యార్థులందరినీ ట్రాక్ చేసే వర్చువల్ సంస్థలా పనిచేయనుంది. అంటే విద్యార్ధులు ఒక కోర్సు చదివే సమయంలో ఏదైనా కారణం చేత దానిని కొనసాగించలేకపోతే.. తర్వాత మళ్లీ చదవాలనుకున్నప్పుడు అదే కోర్సులో చదివే స్వేచ్ఛను అందించాలనే లక్ష్యంతో దీనిని రూపొందించారు. ఎన్‌ఈపీలో వివరించిన విధంగా ఇది బహుళ ప్రవేశాలకు అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే ఉన్న మెకానిజమ్‌లకు కూడా మద్దతు ఇస్తుంది. ఇది విద్యార్థులు నిర్ణీత సమయం తర్వాత ప్రోగ్రామ్ నుంచి నిష్క్రమిస్తే తగిన ధృవీకరణను పొందేందుకు అనుమతినిచ్చే దిశగా ముందుకు సాగుతుంది.

విద్యావేత్తల అభిప్రాయం ఏమంటే..

  • డిజిటల్‌ విధానంలో ఉన్నత విద్యనందిస్తే ఎందరో ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను కోల్పోవల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ విద్యార్థు(E-Students)లను ఎలా మూల్యాంకనం చేయాలనే దానిపై కొంతమంది విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
  • విద్యార్థులను ప్రొక్టోర్డ్ పద్ధతిలో నిరంతరం సమీక్షించేందుకు అవసరమైన సాంకేతికత అందుబాటులో ఉందా లేదా అనేది కూడా అంచనావేయాలి.
  • ఇది అమలులోకి వస్తే ఉన్నత విద్య రాష్ట్ర ప్రభుత్వాలకు తక్కువ ప్రాధాన్యత కలిగిన రంగంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని దశాబ్దాలుగా జీడీపీలో విద్య వ్యయాన్ని ఆరు శాతానికి పెంచాలని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి కూడా. దీనితో ఉన్నత విద్యను చిన్న చూపు చూసే అవకాశం పెరగొచ్చు.
  • యూజీసీ, ఏఐసీటీఈలు విద్యకు దోహదకారులు, సదుపాయ సంధాతలుగాకాకుండా నియంత్రకాలుగా పనిచేస్తున్నయనే భావన పెరిగే అవకాశం ఉంది.

ఈ అన్ని కారణాల దృష్ఠ్యా కేంద్రం నిర్ణయం దేశ యువతకు వరమా? శాపమా? లేక ఇదే శాసనమా? అనేది మునుముందు తెలుస్తుంది.

Also Read:

NMDC Hyderabad 2022: యూజీసీ నెట్‌ స్కోర్‌ ఆధారంగా.. ఎన్‌ఎమ్‌డీసీలో ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ ఉద్యోగాలు..రాత పరీక్షలేకుండానే..

ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!