Edible Oil: గత కొంతకాలంగా వినియోగదారులకు షాక్ ఇస్తూ పైకి పైకి చేరుకున్న వంట నూనెల ధరలు..క్రమంగా దిగి వస్తున్నాయి. ముఖ్యంగా పండుగల సీజన్‌లో వినియోగదారులకు గుడ్ న్యూస్.. వినిపిస్తోంది. క్రమంగా వంటనూనెల ధరలు తగ్గే అవకాశం ఉంది. చమురు ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు వంట నూనెల ధరలపై సమీక్షించేందుకు ఫుడ్ సెక్రటరీ గురువారం ఎడిబుల్ ఆయిల్ కంపెనీలతో సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో రూ. 10 వరకు ధర తగ్గించాలని ప్రభుత్వం కంపెనీలను కోరవచ్చునని తెలుస్తోంది. చాలా నెలలుగా చమురు ధరలు స్థిరమైన… గరిష్ట స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వంట నూనెల ధరలకు తగ్గుముఖం పడితే.. సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. గత కొద్ది రోజులుగా ధర తగ్గుదల కనిపిస్తోంది.
పండుగల సమయంలో వంట నూనె తగ్గుముఖం పడితే.. ఈ విషయంలో ప్రభుత్వం సఫలమైతే పండుగల సీజన్‌లో సామాన్యులకు ఊరట లభించనుంది. ఇందుకోసం వంట నూనె ధరలను ప్రభుత్వం సమీక్షించనుంది. ధరల పెరుగుదలపై పార్లమెంటులో ప్రతిపక్షాలు ప్రస్తావించాయి. ద్రవ్యోల్బణంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తుతూ.. పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నాయి. గురువారం ఆహార కార్యదర్శితో సమావేశమైన తర్వాత.. వంట నూనె ధరలు దాదాపు 8 నుండి 10 రూపాయల వరకు తగ్గనున్నదని భావిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..