Charanjit Singh Channi: పంజాబ్‌ మాజీ సీఎం చన్నీకి ఈడీ ఝలక్‌.. ఇసుక మైనింగ్‌ కేసులో సుదీర్ఘ విచారణ..

పంజాబ్‌ మాజీ సీఎం చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. చన్నీకి గట్టి ఝలక్‌ ఇచ్చింది ఈడీ. ఇసుక మైనింగ్‌ కేసులో చన్నీని సుదీర్ఘంగా విచారించింది ఈడీ. చన్నీ మెడకు కొత్త సమస్య చుట్టుకుంటోంది.

Charanjit Singh Channi: పంజాబ్‌ మాజీ సీఎం చన్నీకి ఈడీ ఝలక్‌.. ఇసుక మైనింగ్‌ కేసులో సుదీర్ఘ విచారణ..
Charanjit Singh Channi

Edited By: Basha Shek

Updated on: Apr 14, 2022 | 9:47 PM

పంజాబ్‌ మాజీ సీఎం చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. చన్నీకి గట్టి ఝలక్‌ ఇచ్చింది ఈడీ. ఇసుక మైనింగ్‌ కేసులో చన్నీని సుదీర్ఘంగా విచారించింది ఈడీ. చన్నీ మెడకు కొత్త సమస్య చుట్టుకుంటోంది. ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీకి తాజాగా మరో షాక్‌ తగిలింది. ఇసుక అక్రమ మైనింగ్‌ కేసులో చన్నీని ఆరుగంటల పాటు విచారించారు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు. ఇసుక మైనింగ్‌కు చన్నీ సహకరించారన్న ఆరోపణలున్నాయి. తన అల్లుడు భూపిందర్‌సింగ్‌ హనీకి చన్నీ తోడ్పాటు అందించారన్న ఆరోపణలపై లేటెస్ట్‌గా దృష్టిసారించింది ఈడీ. విచారణలో చన్నీపై అనేక ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది.

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఇదే కేసులో.. చన్నీ మేనల్లుడు భూపిందర్‌సింగ్‌​హనీని ఈడీ అరెస్టు చేసింది. హనీ సహా మరికొందరిపై జలంధర్‌లోని పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టులో మార్చి 31న ఛార్జిషీట్​ దాఖలైంది. ప్రస్తుతం జుడీషియల్‌ కస్టడీలో ఉన్న చన్నీ మేనల్లుడు.. ఇటీవలే బెయిల్‌​కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మేనల్లుడు హనీ, ఇతరులతో సంబంధాలు, సీఎం క్యాంపు కార్యాలయానికి ఆయన పలుమార్లు రావటంపై చన్నీని ప్రశ్నించినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఇసుక అక్రమ తవ్వకాల్లో భాగంగా.. పలువురు అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించిన ఆరోపణలపైనా చన్నీని ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై చన్నీ ట్వీట్‌​చేశారు.

ఈడీ సమన్లు జారీ చేసిన విషయాన్ని స్వయంగా వెల్లడించారు చన్నీ. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది కోర్టు పరిధిలో ఉన్నందున పెద్దగా మాట్లాడదలచుకోలేదన్నారు. అధికారులు.. తనను మళ్లీ రావాలని ఏం అడగలేదని స్పష్టం చేశారు. ఇటీవల పంజాబ్‌​అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఘోరంగా ఓడిపోయింది. చన్నీ.. తాను పోటీచేసిన రెండు స్థానాల్లోనూ ఓటమిపాలయ్యారు.

Also Read: Kim Jong Un: లేడీ న్యూస్‌రీడర్‌కు బంపర్‌ ఆఫర్ ఇచ్చిన ఉత్తర కొరియా అధినేత కిమ్‌.. ఎందుకో తెలుసా?

రిప్డ్ జీన్స్‌ స్టైలిష్ టాప్ లో ఎట్రాక్ట్ చేస్తున్న రకుల్ ప్రీత్

Rakul Preet Singh : అందాల రకుల్‌కు అదిరిపోయే ఆఫర్.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..