సార్వత్రిక ఎన్నికలకు మరికొద్ది గంటల్లో నగారా మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ప్రస్తుత 17వ లోక్‌సభకు జూన్ 16వ తేదీతో గడువు ముగియనుంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్ 2వ తేదీతో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16తో, ఒడిషా అసెంబ్లీ గడువు జూన్ 24వ తేదీతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఎన్నికల సంఘం అధికారులు.. స్థానిక రాజకీయ పార్టీల నేతలు, క్షేత్రస్థాయిలో అధికారులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. ఎట్టకేలకూ షెడ్యూల్‌ను సిద్ధం చేసింది. గత లోక్‌సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్‌ను ప్రకటించారు. మొత్తం 543 స్థానాలకు ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా ఏప్రిల్-మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి 7 లేదా 8 దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశముందని అధికార వర్గాల సమాచారం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఏప్రిల్ 19 .. తొలిదశ పోలింగ్
ఏప్రిల్ 26 – రెండో దశ పోలింగ్
మే 7 న – మూడో దశ పోలింగ్
మే 13 – నాలుగో దశ పోలింగ్
మే 20 – ఐదో దశ పోలింగ్
మే 25 – ఆరో దశ
జూన్ 1న – ఏడో దశ
— 7 దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్
— 22 రాష్ట్రాల్లో ఒకే దశలో పోలింగ్
— ఏపీ ,తెలంగాణ , అరుణాచల్,ఢిల్లీ,గోవా,గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ , హర్యానా ,
— కేరళ,తమిళనాడు,పంజాబ్,ఉత్తరాఖండ్,సిక్కిం,మిజోరాం,మేఘాలయా.నాగాలాండ్,పుదుచ్చేరి,
— చండీఘడ్,లక్షద్వీప్,దాద్రానగర్ హవేలి,అండమాన్ నికోబార్‌లో ఒకే దశలో పోలింగ్
— కర్నాటక,రాజస్థాన్,త్రిపుర,మణిపూర్‌లో రెండు దశల్లో ఎన్నికలు
— అసోం , చత్తీస్‌ఘడ్‌లో 3 దశల్లో పోలింగ్
— ఒడిశా , మధ్యప్రదేశ్,జార్ఖండ్‌లో 4 దశల్లో పోలింగ్
— మహారాష్ట్ర,జమ్ముకశ్మీర్‌లో ఐదు దశల్లో పోలింగ్
— ఉత్తరప్రదేశ్,బిహార్,బెంగాల్‌లో 7 దశల్లో పోలింగ్
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు మే 13న జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వెలువడుతుంది. ఏప్రిల్ 25 వరకూ నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు అనుమతిస్తారు. ఏప్రిల్ 26న నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుంది. ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు గడువిస్తారు. మే 13న ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4న కౌంటింగ్ ఉంటుంది. జూన్ ఆరు నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది.
సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను సీఈసీ ప్రకటించింది. మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌కు మే 13వ తేదీన ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు.
=దేశవ్యాప్తంగా మోగిన ఎన్నికల నగారా
=ఏపీ, తెలంగాణలో ఒకే రోజు ఎన్నికలు
=మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్
=ఏపీ, తెలంగాణలో ఒకే రోజు ఎన్నికలు
=దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు
=తెలంగాణలో కంటోన్మెంట్ ఉప ఎన్నికకు షెడ్యూల్
=ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు, కౌంటింగ్ జూన్ 4
=ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు
=మార్చి 20న నోటిఫికేషన్, ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్
=తొలి దశలో 102 ఎంపీ స్థానాలకు పోలింగ్
=ఏప్రిల్ 26న రెండో దశ పోలింగ్
=7న మూడో దశ పోలింగ్
=మే 13న నాలుగో దశ పోలింగ్
=నాలుగో దశలో తెలంగాణ ఎంపీ ఎన్నికలు
=మే 20న ఐదో దశ పోలింగ్
=మే 25న ఆరో దశ పోలింగ్
=జూన్ 1న తుది దశ పోలింగ్
=ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సీఈసీ
=దేశంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
=ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ
=11 రాష్ట్రాల్లో రూ.3,400 కోట్లు జప్తు
=వాలంటీర్లు, తాత్కాలిక సిబ్బంది ఎన్నికలకు దూరంగా ఉండాలి
=బ్యాంక్ లావాదేవీలపై నిరంతరం నిఘా
లోక్‌సభ ఎన్నికలు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ రిజర్వ్) నియోజకవర్గానికి నాలుగో విడతలో మే 13న పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. నాలుగో దఫాలోనే ఏపీలో జమిలి ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి కూడా 4వ విడతలోనే ఎన్నిక
నామినేషన్లు ప్రారంభం ఏప్రిల్ 18
నామినేషన్ల చివరి తేది ఏప్రిల్ 25
నామినేషన్ల స్క్రూటనీ ఏప్రిల్ 26
నామినేషన్ల ఉపసంహరణ గడువు ఏప్రిల్ 29
పోలింగ్ తేది మే 13
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4
ఏపీ, తెలంగాణలో 4వ విడతలో ఎన్నికలు
ఏప్రిల్ 18 నోటిఫికేషన్
మే 13 పోలింగ్
జూన్ 04 ఫలితాలు
మొదటి దఫా ఎన్నికలు మార్చి 28
మొత్తం ఏడు విడతల్లో పోలింగ్
జూన్ 4న లోక్ సభ ఎన్నికలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
దేశ వ్యాప్తంగా 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నారు. 543 లోక్ సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ లో మే 13న జమిలి ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల చీఫ్ కమీషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు
జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటన
ప్రచారంలో హద్దు మీరి మాట్లాడవద్దన్న సీఈసీ
హింసాత్మక సంఘటనలకు పాల్పడితే నాన్ బెయిలబుల్ కేసులు – రాజీవ్ కుమార్
ముందుగా ఉప ఎన్నికలపై ఫోకస్
దేశ వ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నట్లు వెల్లడించిన సీఈసీ
ఎన్నికల్లో హింసను అరికట్టేందుకు సీఆర్పీఎఫ్ బలగాలు సిద్దం చేసిన సీఈసీ
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూడాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు కీలక ఆదేశాలు
తప్పుడు ప్రచారాలపై వెంటనే స్పందించాలని అధికారులకు సూచన
ఓటర్లను ప్రభావితం చేసేలా నగదు, కానుకల పంపిణీ జరిగితే వెంటనే యాప్ లో స్పందించండి సీఈసీ
కులం, మతం పేర్లతో ఓట్లు అడగొద్దు, వీటిని అడ్డుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్న రాజీవ్ కుమార్
దేశ వ్యాప్తంగా 1200 మంది పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ప్రతి జిల్లాలో ఒక కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్న సీఈసీ
ఈసీకి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు ఉంటాయన్న రాజీవ్ కుమార్
సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ పై వెంటనే స్పందించేలా పటిష్టమైన యంత్రాంగం ఏర్పాటు
బ్యాంకు లావాదేవీలపై ప్రత్యేక నిఘా ఉంచామన్న సీఈసీ
85 ఏళ్లు దాటిన వారికి, వికలాంగులకు వర్క్ ఫ్రం ఓటింగ్ – సీఈసీ
హింసాత్మక ఘటనలకు పాల్పడితే సహించేది లేదన్న రాజీవ్ కుమార్
సీ-విజిల్ యాప్ ద్వారా ఓటర్లు సమస్యలను నమోదు చేసుకునే అవకాశం
ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేసేవారిపై ప్రత్యేక నిఘా
ఎన్నికల విధులకు దూరంగా వాలంటీర్లు
ఎన్నికల విధులకు తాత్కాలిక సిబ్బందిని అనుమతించని ఎన్నికల సంఘం
ఈడీ సహకారంతో అన్ని రాష్ట్రాల్లో నిఘా పెంచామన్న సీఈసీ రాజీవ్ కుమార్
నగదు పంపిణీ పై ప్రత్యేక నిఘా..
దేశ వ్యాప్తంగా భారీ బందోబస్తు చేస్తున్నామన్నారు
టీవీ, సోషల్ మీడియా ప్రకటనలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్న సీఈసీ రాజీవ్ కుమార్
19.47 కోట్ల మంది ఓటర్లు 20 నుంచి 29 ఏళ్ల లోపు వారు ఉన్నారు
12 రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ
ఈసారి కాశ్మీర్ లో కూడా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపిన ఈసీఈ రాజీవ్ కుమార్ శర్మ
ఎన్నికల బరిలో దేశ వ్యాప్తంగా 1.80 లక్షల మంది సిబ్బందిని సిద్దం చేసినట్లు తెలిపిన సీఈసీ
పురుష ఓటర్ల సంఖ్య 49.7 కోట్లు
మహిళా ఓటర్ల సంఖ్య 47.1 కోట్లు
ట్రాన్స్ జెండర్లు 48 వేలు
కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ వెంటనే అమల్లోకి వచ్చింది.
అర్హులైన ఓటర్లందరూ ఎన్నికల్లో తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించాలని సీఈసీ రాజీవ్ కుమార్ సూచన
ఓటర్ల జాబితా సమయంలో అన్ని పార్టీలకు డ్రాఫ్ట్ జాబితా ఇస్తాం – సీఈసీ రాజీవ్
అన్ని పార్టీలతో మీటింగ్స్ పెట్టినట్లు తెలిపారు.
అభ్యంతరాలు చూసి, సరిదిద్ది జాబితా తయారు చేశామన్నారు సీఈసీ
దేశ వ్యాప్తంగా 96.84 కోట్ల ఓటర్లు ఉన్నట్లు వెల్లడి..
1.82 కోట్ల కొత్త ఓటర్లు ఉన్నట్లు తెలిపారు సీఈసీ రాజీవ్ కుమార్..
55లక్షల ఈవీఎంలు సిద్దం చేసిన ఎన్నికల అధికారులు
10.50 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
జూన్ 16లోపు సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించిన కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్.
దేశ వ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణంతో తెలంగాణలో ఖాళీ అయిన కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. ఈసారి జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి కూడా తొలిసారిగా ఎన్నికల నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసనసభలకు ఎన్నికలు జరుగనున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ స్థానాల్లో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు సైతం షెడ్యూల్ విడుదల కానుంది.
కేంద్ర ఎన్నికల సంఘం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది.