Huzurabad-Badvel ByPoll Date: హుజురాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల..

Huzurabad By Poll: హుజురాబాద్, బద్వేల్ ఉపఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. అక్టోబర్ 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2న కౌంటింగ్ నిర్వహించనున్నారు.

Huzurabad-Badvel ByPoll Date: హుజురాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల..
Election Commission
Follow us

|

Updated on: Sep 28, 2021 | 12:52 PM

తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. హుజురాబాద్, బద్వేల్ రెండు స్థానాల్లో బైపోల్స్ జరగనుండగా.. ఇందుకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 1న విడుదల కానుంది. అక్టోబర్ 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అలాగే అక్టోబర్ 11న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల చివరి తేదీ అక్టోబర్ 13గా ఎలక్షన్ కమిషన్ క్లారిటీ ఇచ్చింది. బైపోల్స్‌ పోలింగ్ తేదీ అక్టోబర్ 30 కాగా.. నవంబర్ 2వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఇక అదే రోజున కౌంటింగ్ పూర్తి కాగానే ఫలితాలను వెల్లడిస్తారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు, మూడు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.

కరోనా నిబంధనలతో తెలుగు రాష్ట్రాల బైపోల్స్..

హుజురాబాద్, బద్వేల్ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. కరోనా నిబంధనల నడుమ ఈ ఉప ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది. ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం విధిస్తూనే.. సభల్లో వెయ్యి మందికి పైగా జనం మించరాదని క్లారిటీ ఇచ్చింది.

హుజురాబాద్, బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..

  • అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల.
  • నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8.
  • అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన.
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13.
  • అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్.
  • నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన.

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే