ఎన్నికల వేళ మహారాష్ట్ర, ఝార్ఖండ్‌‌లలో రూ.558 కోట్లు సీజ్‌

సీజ్‌ చేసిన దాంట్లో రూ.92.47 కోట్లు నగదు కాగా.. రూ.52.76 కోట్ల విలువ చేసే మద్యం, రూ.68.22 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు, రూ.104.18 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.241.02 కోట్ల విలువైన ఉచిత వస్తువులు ఉన్నట్లు పేర్కొంది.

ఎన్నికల వేళ మహారాష్ట్ర, ఝార్ఖండ్‌‌లలో రూ.558 కోట్లు సీజ్‌
Ec Siezes Rs. 280 Cr
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 07, 2024 | 10:00 PM

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిర్వహించిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. నవంబర్‌ 6 వరకు మొత్తంగా రూ.558.67 కోట్లు విలువైన నగదు, ఇతర తాయిలాలను సీజ్‌ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. సీజ్‌ చేసిన దాంట్లో రూ.92.47 కోట్లు నగదు కాగా.. రూ.52.76 కోట్ల విలువ చేసే మద్యం, రూ.68.22 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు, రూ.104.18 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.241.02 కోట్ల విలువైన ఉచిత వస్తువులు ఉన్నట్లు పేర్కొంది.

ఒక్క మహారాష్ట్రలోనే ఈసీ ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి దాదాపు రూ.280 కోట్లు స్వాధీనం చేసుకుంది. అటు జార్ఖండ్‌లో ఇప్పటి వరకు రూ. 158 కోట్ల విలువైన మొత్తాన్ని సీజ్‌ చేశారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే రెండు ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో కలిపి 3.5 రెట్లు పెరిగి మహారాష్ట్ర రూ. 103.61 కోట్లు కాగా, జార్ఖండ్‌కు రూ. 18.76 కోట్లు అని అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..