వచ్చే ఏడాది అయిదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఎలెక్షన్ కమిషన్ బుధవారం ఈ రాష్ట్రాల చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్లతో సమావేశమైంది. యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీల కాల పరిమితి వచ్చే యేడు మార్చి.మే నెలల మధ్య ముగియనుంది, ఈ రాష్ట్రాలకు ఏక కాలంలో ఎన్నికలను నిర్వహించనున్నట్టు తెలియవచ్చింది. ఈ స్టేట్స్ లో శాంతి భద్రతల పరిస్థితులు, పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత, ఓటర్ల రిజిస్ట్రేషన్, ఎలెక్ట్రానిక్ యంత్రాల ఏర్పాటు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా కోవిడ్ మిటిగేషన్ ప్లాన్, పోలింగ్ సిబ్బందికి శిక్షణ, ఈ చర్చల్లో ప్రధానాంశాలయ్యాయి. ఎన్నికల ప్రక్రియలో నిష్పాక్షికత, పారదర్శకత అత్యంత ప్రధానమని చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రంలో సవాళ్లు వేటికవే వేర్వేరుగా ఉంటాయని, అయితే ఎలెక్షన్ ప్లానింగ్ కి ఓటర్-సెంట్రిక్ అప్రోచ్ మెంట్ అన్నది అవసరమని ఆయన చెప్పారు. ఒక విధంగా ఇప్పటి నుంచే ఓటర్ల రిజిస్ట్రేషన్ ముఖ్యమన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
కోవిడ్ పాండమిక్ ని దృష్టిలో ఉంచుకుని స్టాఫ్ తో బాటు ఓటర్లకు కూడా తగిన ప్రొటొకాల్స్ ని సూచించాలన్నారు. సీనియర్ సిటిజన్లకు పోస్టల్ బ్యాలట్ సౌకర్యం, దివ్యాంగులకు ప్రత్యేక రవాణా సదుపాయం వంటి అంశాలను కూడా చీజీఫ్ ఎలెక్షన్ కమిషనర్ ప్రస్తావించారు. ఆయా రాష్ట్రాలు లా అండ్ ఆర్డర్ ని సక్రమంగా పర్యవేక్షించేలా ప్రభుత్వాలకు మీరు సహకరించాలని సుశీల్ చంద్ర సూచించారు. ఇవి వీరి పరిధిలో లేకపోయినప్పటికీ స్థానిక అధికారులతో సమన్వయ పరచుకోవాలన్నారు. ముఖ్యంగా యూపీ వంటి పెద్ద రాష్ట్రాలకు ఇది వర్తిస్తుందని అయన చెప్పారు.
మరిన్ని ఇక్కడ చూడండి : ట్రైలర్ రిలీజ్ చేసిన ఆర్జీవీ..ట్రైలర్ ఏమోగానీ ఆర్జీవీ రియాక్షన్ మాత్రం హైలెట్..:RGV reaction Video.