Money Earning: ఇంటర్నెట్ వాడుతారా? మరెందుకు ఆలస్యం ఇంట్లో కూర్చోనే భారీగా డబ్బు సంపాదిండి.. అదెలాగంటే..

Money Earning: ఓవైపు అంతంత మాత్రం ఆదాయం.. మరోవైపు పెరుగుతున్న ధరలు.. దిక్కుతోచని స్థితిలో అయోమయానికి గురవుతున్నారు సామాన్య ప్రజలు.

Money Earning: ఇంటర్నెట్ వాడుతారా? మరెందుకు ఆలస్యం ఇంట్లో కూర్చోనే భారీగా డబ్బు సంపాదిండి.. అదెలాగంటే..
1
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 14, 2021 | 3:26 PM

Money Earning: ఓవైపు అంతంత మాత్రం ఆదాయం.. మరోవైపు పెరుగుతున్న ధరలు.. దిక్కుతోచని స్థితిలో అయోమయానికి గురవుతున్నారు సామాన్య ప్రజలు. ఈ క్రమంలో అదనపు ఆదాయం వచ్చే మార్గాల కోసం ట్రై చేస్తుంటారు పలువురు. అయితే కొందరికి అవకాశాలు దొరుకుతాయి.. మరికొందరికి దొరకవు. ఒకవేళ దొరికినా పరిస్థితులు అనుకూలించని సందర్భాలు కూడా ఉంటాయి. అయితే పలు సందర్భాల్లో మనం నిత్యం వాడే ఇంటర్నెట్ కూడా మనకు ఆదాయాన్ని తెచ్చి పెడుతుంది. కేవలం క్లిక్ చేయడం ద్వారా అనేక వెబ్ సైట్లు మీకు డబ్బును అందిస్తున్నాయి. ఇంట్లో ఉండి ఇంటర్నెట్ సదుపాయం ద్వారా అతి తక్కు సమయంలోనే అదనపు ఆదాయం ఎలా సంపాదించవచ్చునో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటర్నెట్ ప్రపంచంలో డబ్బు సంపాదనకు అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రకనటలను క్లిక్ చేయడం ఆదాయం ఇచ్చే వెబ్‌సెట్లు చాలానే ఉన్నాయని చెప్పాలి. మీరు ఏదైనా పెయిడ్ టు క్లిక్(పిటిసి) వెబ్‌సైట్‌లో రిజిస్ట్రర్ చేసుకోవాలి. Clixsense.com, NeoBux వంటి పిటిసి వెబ్‌సైట్లలో ప్రకటనలను వీక్షించడం ద్వారా డబ్బులు చెల్లిస్తాయి.

ఒక యాప్, వెబ్‌సైట్‌కు ప్రచారాన్ని కల్పించడం ద్వారా.. ఇంటర్నెట్‌లో ఒక వెబ్‌సైట్, యాప్‌కు ప్రచారం కల్పించడం ద్వారా డబ్బును సంపాదించవచ్చు. దీని కోసం మీరు సంబంధిత వెబ్‌సైట్‌, యాప్‌లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత మీ స్నేహితులు, వారి స్నేహితులకు ఈ విధానం గురించి వివరించి వారిని కూడా లాగిన్ చేయిస్తే సరిపోతుంది. అలా మీరు ఇచ్చిన కోడ్ ద్వారా ఇతరులు లాగిన్ అయిన ప్రతిసారి మీ అకౌంట్‌లో డబ్బు క్రమంగా జమ అవుతుంది. అంటే చైన్ సిస్టమ్ అనమాట.

మెయిల్స్ చదవండి.. డబ్బు సంపాదించండి.. ఇక్కడ డబ్బు సంపాదనకు మరో మార్గం కూడా ఉంది. మెయిల్స్ చదవడం ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. Money Mail.Com లో మెయిల్ చదవడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. ఈ వెబ్‌సైట్ ద్వారా నెలకు పది వేల రూపాయల వరకు సంపాదిస్తున్నామని చాలా మంది పేర్కొన్నారు. అయితే, దీని ద్వారా డబ్బు సంపాదించాలంటే.. ప్రతిరోజూ మీ ఖాతాకు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అలా ఇన్‌బాక్స్‌కు వచ్చే మెయిల్స్‌ను క్రమం తప్పకుండా చదవితే సరిపోతుంది. మీరు చదివిన మెయిల్‌ను మీ స్నేహితుడికో, ఇతరులకో సిఫారసు చేయాలి. ఇలా మెయిల్ గరించి అందరికీ సిఫారసు చేసి వారిచే మెయిల్స్ చదవించడం ద్వారా మీకు కొంత మొత్తం లభిస్తుంది. మ్యాట్రిక్స్ మెయిల్.కామ్‌లో గంటలో రెండు నుండి రెండున్నర వేల రూపాయలను సులభంగా సంపాదించవచ్చునని ఇప్పటికే ఈ మార్గంలో డబ్బు సంపాదిస్తున్న వారు చెబుతున్నారు.

ఇదిలాఉంటే.. తమ ఉత్పత్తులను సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి పలు కంపెనీలు డబ్బులను చెల్లిస్తున్నాయి. అందుకోసం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సాధనాలు అవసరం. మీరు మీ సోషల్ మీడియా ఖాతాల్లో కంపెనీలకు సంబంధించి ఉత్పత్తులను ప్రమోట్ చేయాడం ద్వారా సదరు కంపెనీల నుంచి మీకు డబ్బు లభిస్తుంది. దాంతోపాటు.. మీరు స్వంత వీడియోలు తయారు చేయడం ద్వారా, ఇన్‌బాక్స్ డోల్స్ వంటి వెబ్‌సైట్లలో వీడియోలను చూడటం ద్వారా కూడా డబ్బు సంపాదివచ్చు. కొన్ని యాప్‌లు ప్రారంభంలో మంచి మంచి ఆఫర్లను ఇస్తుంటాయి. వాటిని ప్రమోట్ చేయడం ద్వారా పాయింట్స్ ఇస్తుంటాయి. అలా ఇచ్చిన పాయింట్స్‌ను డబ్బు రూపంలో మార్చుకోవచ్చు.

గేమ్స్‌, ఫోటోలతో మనీ సంపాదించొచ్చు.. సెకండ్ లైఫ్, లక్టాస్టిక్, మిస్ట్ ప్లే వంటి చాలా వెబ్‌సైట్లు గేమ్స్ ఆడటం, ఫోటోలు తీసి అప్‌లోడ్ చేయడం వంటి వాటికి డబ్బులు చెల్లిస్తాయి. ఈ వెబ్‌సైట్లలో మీరు గేమ్స్ ఆడటం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. కొన్ని వెబ్‌సైట్లు ఈ మొత్తాన్ని గిఫ్ట్ కార్డుగా, కొన్ని పేపాల్ ద్వారా చెల్లిస్తాయి. మీకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ఉంటే, వాటిని మీరు షట్టర్‌స్టాక్, జెట్టి ఇమేజెస్, ఫోటోషెల్టర్ వంటి ప్రసిద్ధ సైట్లలో అప్‌లోడ్ చేయవచ్చు. ఇక్కడ, ఎవరైనా మీ ఫోటోను స్కాన్ చేయాలంటే కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించిన దాంట్లో కొంత మొత్తం మీ ఖాతాలో జమ అవుతుంది. ఇంకా క్యాష్ ఫర్ ఆఫర్.కామ్‌లో గోల్డెన్ మెంబర్‌షిప్‌ తీసుకున్న వెంటనే మీకు ఆ మొత్తం చెల్లించబడుతుంది. మీరు వెబ్‌సైట్‌లో సైన్ ఇన్ చేసిన వెంటనే మీకు 5 డాలర్లు అంటే రూ. 300 నుంచి రూ.350 వరకు లభిస్తాయి.

అసలు ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో క్లిక్ చేస్తే, మెయిల్స్ చదవితే డబ్బులు ఇచ్చేస్తారా? అనే అనుమానం సహజంగానే అందరికీ కలుగుతుంది. అయితే అలా చేయడం సదరు కంపెనీలకు చాలా ప్రయోజనాలు ఒనగూరుతాయి. ఈ చైన్ సిస్టమ్ ద్వారా.. సదరు కంపెనీలకు విపరీతమైన ప్రచారం జరుగుతుంది. తద్వారా యాడ్స్, ఇతర మార్గాల రూపేనా వారికి డబ్బులు సమకూరుతాయి. వాటి ద్వారా మీకూ డబ్బు లభిస్తుంది.

Also read: ICICI Bank FD scheme: సీనియ‌ర్ సిటిజ‌న్లకు గుడ్ న్యూస్.. అధిరిపోయే ఆఫర్ ప్రకటించిన ఐసీఐసీఐ..

Patalakka Shyama : పాటలక్క శ్యామాగా డీ గ్లామర్ రోల్ లో చేస్తున్న కన్నడ నటి.. రియల్ గా ఎంత అందగత్తో తెలుసా..!