
దేశంలో మరోసారి భూకంపం భయభ్రాంతులకు గురి చేసింది. ఢిల్లీ NCR లో బలమైన భూకంపం సంభవించింది. గురువారం ఉదయం 9:04 గంటలకు భూమి అకస్మాత్తుగా కంపించడం ప్రారంభించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైనట్లు అధికారులు అంచనా వేశారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌లలో దాదాపు 10 సెకన్ల పాటు భూకంప ప్రకంపనలు సంభవించాయి.
ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, భివానీ, ఝజ్జర్, బహదూర్‌గఢ్ సహా అనేక నగరాల్లో భూకంప ప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం హర్యానాలోని ఝజ్జర్‌లో ఉందని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Best Smartphones: మీ బడ్జెట్ రూ.25,000లోపునా..? బెస్ట్ కెమెరా ఉన్న ఉత్తమ స్మార్ట్ ఫోన్లు ఇవే!
భూకంప కేంద్రం పశ్చిమ ఢిల్లీకి కేవలం 51 కిలో మీటర్ల దూరంలో ఉంని, రాజస్థాన్, యూపీలోని పలు ప్రదేశాల్లోనూ భూమి కంపించిందని అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలిపారు.
ఇది కూడా చదవండి: HDFC: హెచ్‌డీఎఫ్‌సీ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. బ్యాంకు కీలక నిర్ణయం..!
ఇదిలా ఉండగా, అధికారిక సమాచారం ప్రకారం, ఆగస్టు 27, 1960న దేశ రాజధాని ఢిల్లీలో అతిపెద్ద భూకంపం వచ్చింది. ఆ సమయంలో ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఉదయం వేళ భూకంపం ప్రకంపనలు సంభవించాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజ, ఇతర భూకంప రికార్డుల ప్రకారం, ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.6 నమోదైంది. ఈ భూకంపం కేంద్రం ఢిల్లీ సమీపంలోనే ఉంది. ఈ భూకంపం నగరాన్ని చాలా దెబ్బతీసింది.
ఇది కూడా చదవండి: Minimum Balance Rules: పండగ లాంటి వార్త.. ఈ బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు.. ఛార్జీలు రద్దు!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి