AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarakhand Earthquake: ఉత్తరాఖండ్‌లో భూకంపం.. తెల్లవారుజామున ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..

Earthquake in Uttarakhand: ఉత్తర భారతదేశంలో తరచూ సంభవిస్తున్న భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో శనివారం

Uttarakhand Earthquake: ఉత్తరాఖండ్‌లో భూకంపం.. తెల్లవారుజామున ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..
Earthquake
Shaik Madar Saheb
|

Updated on: Sep 11, 2021 | 10:37 AM

Share

Earthquake in Uttarakhand: ఉత్తర భారతదేశంలో తరచూ సంభవిస్తున్న భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో శనివారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 4.6గా నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. జోషిమఠ్‌కు 31 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిపల్‌కోటి వద్ద ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు ఉదయం 5.58 గంటలకు భూప్రకంపనలు సంభవించాయి. ఈ సమయంలో జోషిమఠ్‌లో భవనాలు స్వల్పంగా కంపియాని అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు తెల్లవారుజామున ఇళ్ల నుంచి బయటకు పరగులు తీశారు.

ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. కాగా.. దీని ప్రభావం చుట్టుపక్కల రాష్ట్రాలపైనా కనిపించిందని.. పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు.

కాగా అంతకుముందు గురువారం హిమాచల్ ప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. కాంగడా జిల్లాలో భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత 3.6గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Also Read;

Crime news: సైదాబాద్ బాలికపై అత్యాచారం, హత్య ఘటన.. పోలీసుల అదుపులో నిందితుడు..

Crime News: చెల్లిని దారుణంగా చంపిన అన్న.. వేరే వ్యక్తితో చనువుగా ఉంటోందని.. తుపాకీతో..

మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్ పాత్రలు యానిమేషన్ రూపంలో!
మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్ పాత్రలు యానిమేషన్ రూపంలో!
సెలబ్రిటీల ప్రేమ కొట్టేసిన మూగజీవాలు..ఒక్కో పెట్ ధర లక్షల్లో!
సెలబ్రిటీల ప్రేమ కొట్టేసిన మూగజీవాలు..ఒక్కో పెట్ ధర లక్షల్లో!
రామాయణ క్యాస్టింగ్ చూస్తుంటేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్
రామాయణ క్యాస్టింగ్ చూస్తుంటేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్
సెక్యూరిటీని తోసేసి పైన పడ్డ జనం.. భయమేసిందన్న స్టార్​ యాక్టర్​!
సెక్యూరిటీని తోసేసి పైన పడ్డ జనం.. భయమేసిందన్న స్టార్​ యాక్టర్​!
తెలుగు ముగింట్లో మాయ చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మలు
తెలుగు ముగింట్లో మాయ చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మలు
తిరుమల సంపదకే రక్షకులు.. శంఖనిధి, పద్మనిధులు దర్శిస్తే..
తిరుమల సంపదకే రక్షకులు.. శంఖనిధి, పద్మనిధులు దర్శిస్తే..
మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?
మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?
దుబాయ్‌లో 20 లక్షల బంగారం కొని, భారత్‌లో అమ్మితే ఎంత మిగులుతుంది?
దుబాయ్‌లో 20 లక్షల బంగారం కొని, భారత్‌లో అమ్మితే ఎంత మిగులుతుంది?
దేశ ప్రజలకు బంపర్ న్యూస్.. తగ్గనున్న వీటి ధరలు..
దేశ ప్రజలకు బంపర్ న్యూస్.. తగ్గనున్న వీటి ధరలు..
మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5లక్షలు కాదు ఏకంగా రూ.8 లక్షలు..
మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5లక్షలు కాదు ఏకంగా రూ.8 లక్షలు..