Earhquake: భారీ భూకంపం.. సిక్కిం-నేపాల్, అస్సాం, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కంపించిన భూమి..
Earhquake: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ భూకంపం సంభవించింది. సిక్కిం-నేపాల్ సరిహద్దు సహా అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో భూమి కంపించింది.
Earhquake: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ భూకంపం సంభవించింది. సిక్కిం-నేపాల్ సరిహద్దు సహా అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో భూమి కంపించింది. రాత్రి 8:49 సమయంలో భూమి కంపించింవది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం, రిక్టర్ స్కేల్‌పై భూకంపం 5.4 గా నమోదైంది. కాగా, భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ అధికారులు ప్రకటించారు. కాగా, బీహార్‌లోని పాట్నా, కటిహార్, భాగల్‌పూర్ సహా అనేక జిల్లాల్లో భూకంప ప్రకంపనలు సంభవించాయి. అదే సమయంలోడార్జిలింగ్, సిలిగురి, దక్షిణా దినాజ్‌పూర్, రాయిగంజ్, జల్పాయిగురి, అలీపుర్దువార్లలోనూ భూమి కంపించింది. ఇక్కడ సంభవించిన భూప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 4.2 గా నమోదైంది. ఈ భూప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిళ్లలేదు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ANI Tweet:
Earthquake of magnitude 5.4 on the Richter scale occurred near Sikkim-Nepal border at 2049 hours: National Center for Seismology pic.twitter.com/FxT8RfV43r
— ANI (@ANI) April 5, 2021
ఇదిలాఉంటే.. ఏప్రిల్ 2వ తేదీన మిజోరంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రంగా 3.8 గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం మిజోరంలోని ఈశాన్య ప్రాంతమైన ఐజ్వాల్‌లో భూకంపం సంభవించింది. అదే సమయంలో, లడఖ్‌లోని లేహ్‌లో అర్థరాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని ప్రభావం 3.1 గా నమోదైంది. ఇక మార్చి 6 న లడఖ్‌లో భూకంప ప్రకంపనలు సంభవించాయి. అప్పుడు భూకంప తీవ్రత 3.6 నమోదైంది.
Also read:
Corona: మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. 24గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే?
Liver Diet: లివర్ సమస్యలతో బాధపడుతున్నారా..! అయితే ఒక్క వారం రోజులు ఈ ఆహార నియమాలు పాటించండి..