India Earthquake: ఉత్తరాదిని వణికించిన భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం..

|

Jun 13, 2023 | 2:28 PM

North India Earthquake: ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది. దేశ రాజధాని న్యూఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో మంగళవారం మధ్యాహ్నం 1:30 తర్వాత భూప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు.

India Earthquake: ఉత్తరాదిని వణికించిన భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం..
Earthquake
Follow us on

North India Earthquake: ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది. దేశ రాజధాని న్యూఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో మంగళవారం మధ్యాహ్నం 1:30 తర్వాత భూప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. కొన్ని సెకన్ల పాటు భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ, జమ్మూకశ్మీర్, చండీగఢ్‌, పంజాబ్‌లో ప్రకంపనలు సంభవించాయి. జమ్మూకశ్మీర్‌ని శ్రీనగర్‌లో భారీ ప్రకంపనలు సంభవించాయి. జమ్మూలోని దోడా జిల్లాలోని గండోహ్ భలెస్సా గ్రామ సమీపంలో 5.7 తీవ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే, జమ్మూ సహా.. ఢిల్లీ – ఎన్సీఆర్, హిమాచల్ ప్రదేశ్ పలుచోట్ల రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.4 నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) పేర్కొంది.

దోడాలోని గందోభలేసా గ్రామానికి 18 కి.మీల దూరంలో.. 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు ఎన్సీఎస్ తెలిపింది. అన్ని ప్రాంతాల్లో దాదాపు 10 సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భయంతో ఇళ్లల్లోనుంచి బయటకు పరుగులు తీశారు.

ఇవి కూడా చదవండి

అయితే, మణిపూర్‌లో భూమి స్వల్పంగా కంపించగా.. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో సైతం భూ ప్రకంపనలు సంభవించినట్లు ఎన్సీఎస్ పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..