ఢిల్లీలో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 2.7 తీవ్రత! ఇళ్లనుంచి పరుగులు తీసిన ప్రజలు..

|

Mar 22, 2023 | 7:46 PM

ఢిల్లీలో పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు ప్రధాన కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే రాజధాని ప్రాంతంలో భూకంపం సంభవించింది.

ఢిల్లీలో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 2.7 తీవ్రత! ఇళ్లనుంచి పరుగులు తీసిన ప్రజలు..
Earthquake
Follow us on

త్తర భారత దేశంలో భూ ప్రకంపనలు ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. మంగళవారం ఢిల్లీతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రికర్ట్ స్టేల్ పై 6.6 గా నమోదయింది. ఆప్ఘనిస్థాన్‌లోని హిందూకుషిలో భూ ఉపరితలం నుంచి 180 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పాకిస్థాన్ వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి 10.20 గంటల సమయంలో ఈ భూ కంపం సంభవించింది. ఢిల్లీలోని పలుచోట్ల భవనాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలో మరోమారు భూమి కంపించింది. ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో మళ్లీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 2.2 తీవ్రత నమోదైంది. భూకంపం రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆఫీసుల్లో పనిచేసే వారు కూడా వెళ్లిపోయారు. ఇప్పుడు ఢిల్లీలో ఆందోళన వాతావరణం నెలకొంది.

ఈ రోజు ఢిల్లీలో పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు ప్రధాన కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే రాజధాని ప్రాంతంలో భూకంపం సంభవించింది. అనేక గృహోపకరణాలు నేలకూలాయి. భూకంపం తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..