
హర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. పొగ మంచు దట్టంగా కమ్ముకోవడంతో దారి కనిపించక ఒక దాని వెనక మరొకటి సుమారు 15 వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ఘటన యమునా నగర్‌లో జరిగింది. అయితే ప్రమాదం తృటిలో తప్పిపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అంబాలా – యమునానగర్ – సహరన్‌పూర్ జాతీయ రహదారిపై పొగ మంచు దట్టగా కమ్ముకుంది. దీంతో వాహనాలు వేగంగా ఢీ కొన్నాయి. ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాక చర్యలు చేపట్టారు. కార్లలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. చికిత్స కోసం వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్రేన్ల సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించారు.
మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యంతో అల్లాడిపోతోంది. గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. సరి బేసి విధానం, బాణా సంచాపై నిషేధం.. ఇలా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రభావవంతమైన ఫలితాలును ఇవ్వడం లేదు. కొన్ని రోజులుగా ఉదయం పూట నగరంలో దట్టంగా పొగమంచు కమ్ముకుంటోంది. రోడ్లపై వెలుతురు సరిగా పడటం లేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలు సాగించే సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారు.
కలుషితమైన గాలి వల్ల ఊపిరితిత్తులు, కంటి సమస్యలు వస్తున్నాయి. గుండె ఆరోగ్యం క్షీణిస్తోంది. నగరాళ్లో నివసించే వారి సెక్స్ డ్రైవ్ కు ఈ కలుషితమైన గాలి ప్రతికూకలంగా మారిందని పరిశోధకులు చెబుతున్నారు. శ్వాసకోస సమస్యలు, ఉబ్బసం, సైనసైటిస్ వంటి సమస్యలు వేధిస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..