El Nino: దేశంలో కొనసాగుతున్న ఎల్ నినో.. వర్షాలపై తీవ్ర ప్రభావం..

దీని ప్రభావం అమెరికా దేశాలతోపాటు.. ఇతర దేశాల్లోనూ ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయట.. సాధారణం కన్నా ఎక్కువ స్థాయిలో వర్షాలు పడడం, లా నినో ( LA NINO) అంటారు. అసలు ఈ ఎల్ నినో, లా నినో అంటే ఏంటి.? వర్షాలకి ఎల్ నినో, లా నినో కి సంబంధం ఏంటి..?, ఎల్ నినో అంటే వర్షాభావ పరిస్ధితి కాగా, లా నినా అంటే విపరీతంగా వర్షాలు కురిసే పరిస్థితి అని అర్థం.

El Nino: దేశంలో కొనసాగుతున్న ఎల్ నినో.. వర్షాలపై తీవ్ర ప్రభావం..
El Nino

Edited By:

Updated on: Jul 07, 2023 | 8:00 PM

ఈ సంవత్సరం తప్పని వర్షాభావం. ఎందుకంటే ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైంది. ఋతుపవనాలు వచ్చాక కూడా జూన్ నెలలో వర్షాలు సాధారణం కన్నా తక్కువ కురిసాయి. దీనికి కారణం ఎల్ నినో (EL NINO) అంటున్నారు పర్యావణవేత్తలు. గత నాలుగైదు సంవత్సరాలు పుష్కలంగా వర్షాలు కురిసాయి. ఉపరితల ఉష్ణోగ్రత మార్పుల ప్రభావం వల్ల పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో ఏర్పడిందంటుంది ప్రపంచ వాతావరణ సంస్థ. దీని ప్రభావం అమెరికా దేశాలతోపాటు.. ఇతర దేశాల్లోనూ ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయట.. సాధారణం కన్నా ఎక్కువ స్థాయిలో వర్షాలు పడడం, లా నినో ( LA NINO) అంటారు. అసలు ఈ ఎల్ నినో, లా నినో అంటే ఏంటి.? వర్షాలకి ఎల్ నినో, లా నినో కి సంబంధం ఏంటి..?, ఎల్ నినో అంటే వర్షాభావ పరిస్ధితి కాగా, లా నినా అంటే విపరీతంగా వర్షాలు కురిసే పరిస్థితి అని అర్థం.

ఎల్ నినో పశ్చిమ పసిఫిక్‌లో అధిక వాయు పీడనం, తూర్పు పసిఫిక్‌లో తక్కువ వాయు పీడనంతో కూడి ఉంటుంది. ఎల్ నినో దాదాపు నాలుగు సంవత్సరాల వరకు కొనసాగుతాయి. ఎల్ నినో అభివృద్ధి సమయంలో, సెప్టెంబర్-నవంబర్ మధ్య వర్షపాతం అభివృద్ధి చెందుతుంది. ఎల్ నినో అనేది వర్షాభావ పరిస్థితులు ఏర్పడేది. వర్షభావం ఏర్పడినప్పుడు భూమిపై ఉన్న ప్రతి ఒక్క జీవరాశికి ప్రభావం చూపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఎల్ నినో ప్రతి 4-5 సంవత్సరాలకు వస్తుంది కాబట్టి లా నీన పరిస్తులు వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి. చెరువులను కాపాడుకోవాలి దానివలన వర్షాభావం ఏర్పడినప్పుడు ఎంతగానో ఉపయోగపడి ఎల్ నినో ప్రభావం ఎక్కువ కనిపించదు అంటున్నారు పర్యావణవేత్తలు.