Viral Video: రైలు రెండు కోచ్‌ల జాయింట్‌ రాడ్‌పై కూర్చున్న ప్రయాణించిన మహిళ.. వీడియో.

Viral Video: రైలు రెండు కోచ్‌ల జాయింట్‌ రాడ్‌పై కూర్చున్న ప్రయాణించిన మహిళ.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Jul 07, 2023 | 8:27 PM

పరిస్థితులు మనిషిని ఎంతటి సాహసానికైనా ఉసిగొల్పుతాయి. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఇందులో ఓ మహిళ చాలా ప్రమాదకర స్థితిలో ఒడిలో పసిబిడ్డను పెట్టుకొని ప్రయాణిస్తోంది. ఆ మహిళ అత్యంత వేగంగా వెళ్తున్న రైలు బోగీల జాయింట్‌ రాడ్‌పై కూర్చుని ప్రయాణిస్తోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ రైలు అత్యంత వేగంగా కదులుతోంది. అయితే ఆ రైలులోని రెండు కోచ్‌ల జాయింట్‌లో ఒక మహిళ కూర్చుని ఉంది. అంతేకాదు ఆమె ఒడిలో పసిపాప కూడా ఉంది. ఒకచేత్తో బిడ్డను పట్టుకొని, మరో చేత్తో రైలు కడ్డీని పట్టుకుంది. ఆ మహిళ చేయి ఏమాత్రం పట్టుతప్పినా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ వీడియోను ఓ ట్విట్టర్ యూజర్‌ తన ఖాతాలో షేర్‌ చేస్తూ, టికెట్‌ కొనడానికి మహిళవద్ద డబ్బులేక ఈ ప్రమాదకర ప్రయాణం అంటూ క్యాప్షన్‌ జోడించారు. వీడియో చూసిన చాలా మంది స్పందించారు. అలాంటి ప్రయాణం అత్యంత ప్రమాదకరమని, ఎంత డబ్బు లేకపోయినా అలాంటి సాహసాలు చేయకూడదని హితవు పలుకుతున్నారు. అయితే ఈ వీడియో భారత్‌ది కాదని, బంగ్లాదేశ్‌కు చెందినదని కొందరు వాదిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...