- Telugu News Photo Gallery Interest free Loans: Karnataka Budget 2023, Interest Free Loan Limit Increased To Rs 5 Lakh
Interest free Loans: ఆ రాష్ట్ర రైతులకు గుడ్‌న్యూస్.. 3 లక్షల నుంచి 5 లక్షల వరకు రుణ పరిమితి పెంపు
ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం పలు పథకాలను ప్రవేశపెడుతూ అండగా నిలుస్తున్నాయి. వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కీలక ప్రకటనలు చేస్తోంది..
Updated on: Jul 07, 2023 | 6:17 PM

కర్ణాటక ముఖ్యమంత్రి సీఎం సిద్ధరామయ్య తన 14వ బడ్జెట్‌లో రైతులకు శుభవార్త అందించారు. రైతులకు వడ్డీలేని రుణాలను 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచారు.

అలాగే మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచారు. మెట్ట ప్రాంతాల రైతులకు పిక్ వ్యాన్ల కొనుగోలుకు తక్కువ వడ్డీకి రూ .7 లక్షల వరకు రుణం ఇస్తామని బడ్జెట్ లో ప్రకటించారు.

సిద్ధరామయ్య తన బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి మేలు చేసే అనేక అభివృద్ధి పనులను ప్రకటించారు. రూ.75 కోట్లతో శిడ్లఘాట్‌లో పట్టు మార్కెట్ ఏర్పాటు, కొబ్బరి , వేరుశనగ, ద్రాక్ష, దానిమ్మ పంటల ప్రాసెసింగ్ కోసం 10 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్, చిక్కమగళూరులో టూరిజం, కాఫీ పరిశ్రమల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని బడ్జెట్‌లో పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అనుగ్రహ యోజన కింద గొర్రెల పెంపకందారులకు సౌకర్యాలు కల్పించింది. ఈ పథకంలో గొర్రెలు, మేకలు చనిపోతే యజమానులకు రూ.5 వేల వరకు పరిహారం అందజేస్తారు .

ఇంకా గ్రామీణ ప్రాంతాల్లోని 19 చెరువులను నింపేందుకు రూ .770 కోట్లు కేటాయించారు. పశువులకు సంబంధించిన స్రవంతి ప్రాజెక్టు కోసం మొత్తం రూ.22,252 కోట్లు కేటాయించారు.




