AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మితే.. నిండా నట్టేట ముంచింది.. సీన్ కట్ చేస్తే.!

గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా అనుసరించిన ఓ వ్యక్తి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. బీహార్‌లోని గోపాల్‌గంజ్‌కు చెందిన ఒక వ్యక్తి గోరఖ్‌పూర్‌లో పార్టీ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఆ వ్యక్తి పూర్తి చిరునామాను నమోదు చేయడానికి బదులుగా, తన గ్రామ పేరు గోపాల్‌పూర్ అని టైప్ చేసి, యాప్ సూచనల ఆధారంగా డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టాడు.

గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మితే.. నిండా నట్టేట ముంచింది.. సీన్ కట్ చేస్తే.!
Drunk Man Onto Railway Tracks In Up
Balaraju Goud
|

Updated on: Apr 10, 2025 | 9:31 AM

Share

గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా అనుసరించిన ఓ వ్యక్తి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. బీహార్‌లోని గోపాల్‌గంజ్‌కు చెందిన ఒక వ్యక్తి గోరఖ్‌పూర్‌లో పార్టీ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఆ వ్యక్తి పూర్తి చిరునామాను నమోదు చేయడానికి బదులుగా, తన గ్రామ పేరు గోపాల్‌పూర్ అని టైప్ చేసి, యాప్ సూచనల ఆధారంగా డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. సంఘటన జరిగినప్పుడు ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.

గూగుల్ మ్యాప్స్ దిశను అనుసరించి ఉత్తరప్రదేశ్ నుండి బీహార్‌లోని తన గ్రామానికి కారులో బయలుదేరాడు ఓ వ్యక్తి. ఆ వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని లక్నో ప్రాంతంలోని డోమిన్‌గఢ్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పైకి కారును నడుపుతున్నాడు. అతని కారు పట్టాల పక్కన ఉన్న కంకరలో చిక్కుకుంది. కొన్ని క్షణాల తర్వాత, ఒక గూడ్స్ రైలు అదే ట్రాక్‌పైకి వచ్చింది. అదృష్టవశాత్తూ, లోకో పైలట్ కారును సకాలంలో గుర్తించి, అత్యవసర బ్రేక్‌ను లాగడంతో, వాహనానికి కేవలం 5 మీటర్ల దూరంలో రైలును నిలిపివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే కారు డ్రైవర్‌ను గోపాల్‌గంజ్‌లోని గోపాల్‌పూర్ నివాసి ఆదర్శ్ రాయ్‌గా గుర్తించారు. తాను గోరఖ్‌పూర్‌లో ఒక పార్టీకి హాజరైనానని, రాత్రి ఆలస్యంగా తిరిగి వస్తున్నానని పోలీసులకు చెప్పాడు. గూగుల్ మ్యాప్స్‌లో పూర్తి చిరునామాకు బదులుగా తన గ్రామం పేరును మాత్రమే నమోదు చేసినట్లు ఒప్పుకున్నాడు.

అతను GPS సూచనలను అనుసరిస్తూ, డోమిన్‌గఢ్ బండ్ సమీపంలోని రైల్వే పట్టాల వద్దకు చేరుకున్నాడు. కారు ముందు చక్రం ట్రాక్ పక్కన ఉన్న వదులుగా ఉన్న కంకరలో చిక్కుకుంది. వెంటనే, సహజన్వా నుండి ఒక రైలు ట్రాక్ వద్దకు వచ్చింది. లోకో పైలట్ సకాలంలో స్పందించి వేగంగా వస్తున్న రైలును సురక్షితంగా నిలిపివేశాడు. ఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, కారును తొలగించి, ట్రాక్‌ను క్లియర్ చేసింది. రైలు దాదాపు 57 నిమిషాలు ఆలస్యమైంది. కానీ అదృష్టవశాత్తూ, ఆ సమయంలో మరే ఇతర రైళ్లు రాలేదు. దర్యాప్తులో, సంఘటన జరిగిన సమయంలో ఆదర్శ్ బాగా మద్యం సేవించి ఉన్నాడని RPF గుర్తించింది. అతన్ని అక్కడికక్కడే అరెస్టు చేసి, అతని కారును స్వాధీనం చేసుకున్నారు. రైల్వే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..