అనుమానంతో కారులో అణువణువు తనిఖీ.. కనిపించింది చూసి ఖాకీలు స్టన్..

ఓ వ్యక్తి కారులో దర్జాగా వస్తున్నాడు.. మనకు తిరుగులేదేలే అంటూ రయ్యిరయ్యిన దూసుకువస్తున్నాడు.. ఈ క్రమంలోనే.. పోలీసులు ఎంటర్ అయ్యారు.. పోలీసులు అంతా ఆ కారును చుట్టుముట్టి ఆపారు.. ఆ తర్వాత వివరాలు అడిగి క్షుణ్ణంగా తనిఖీ చేశారు.. మొదట ఏం కనిపించలేదు.. కానీ.. అప్పుడే.. కొంత మందిని రంగంలోకి దింపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో దిమ్మతిరిగే ట్విస్ట్ తెరపైకి వచ్చింది..

అనుమానంతో కారులో అణువణువు తనిఖీ.. కనిపించింది చూసి ఖాకీలు స్టన్..
Assam Police Seize Drugs
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 28, 2024 | 6:09 PM

ఓ కారు.. అందులో ఓ వ్యక్తి దర్జాగా వస్తున్నాడు.. మనకు తిరుగులేదేలే అంటూ రయ్యిరయ్యిన దూసుకువస్తున్నాడు.. సరిగ్గా అప్పుడే దిమ్మతిరిగే ట్విస్ట్ తెరపైకి వచ్చింది.. పోలీసులు అంతా ఆ కారును చుట్టుముట్టారు.. అప్పటికే సమచారం అందింది. పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగారు.. చివరకు కారులో అణువణువు తనిఖీ చేశారు.. అప్పుడే అసలు గుట్టు బయటపడింది.. అందులో ఎన్నో అరలు బయటపడ్డాయి.. వాటిని చూసి ఖాకీలే స్టన్ అయ్యారు.. దానిలో కోట్ల విలువైన హెరాయిన్ బయటపడింది.. ఈ షాకింగ్ ఘటన అస్సాంలో జరిగింది.. నాగావ్‌లో రూ. 3.5 కోట్ల విలువైన 532 గ్రాముల హెరాయిన్‌ను అస్సాం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అస్సాం రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై తమ అణిచివేత కొనసాగిస్తూ ఒక వ్యక్తిని అరెస్టు చేసి.. కోట్లాది రూపాయల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా.. ఈ ఆపరేషన్ నిర్వహించారు.. వాహనాన్ని అడ్డగించిన తర్వాత కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్ ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.. ఈ కేసుకు సంబంధించి కారు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఆపరేషన్‌ను నాగావ్ పోలీసులు పక్కా సమాచారంతో రంగంలోకి దిగారు.. వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన సమయంలో లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కారులోని రహస్య గదుల్లో దాచిన హెరాయిన్‌ను కనుగొన్నారు. వీధి విలువ రూ. 3.5 కోట్లు ఉంటుంది.. ఈ డ్రగ్స్‌ను వాహనంలో ప్రత్యేక అరలు ఏర్పాటు చేసి జాగ్రత్తగా దాచి ఉంచారు.. అయితే పోలీసుల అప్రమత్తతతోనే ఈ ఆపరేషన్ విజయవంతం అయిందని అధికారులు తెలిపారు.

అభినందించిన ముఖ్యమంత్రి..

డ్రగ్స్ అణచివేతలో పోలీసుల కృషిని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రశంసించారు. పోలీసులు అప్రమత్తతోనే ఇది సాధ్యమైందంటూ వారిని అభినందిస్తూ ట్వీట్ చేశారు..

కాగా.. డ్రగ్స్ ట్రాఫికింగ్ ఆపరేషన్‌లో ఉన్న విస్తృత నెట్‌వర్క్‌ను వెలికితీసేందుకు పోలీసులు ఇప్పటికే తదుపరి దర్యాప్తును ప్రారంభించారు. హెరాయిన్ మూలాలను గుర్తించడానికి అరెస్టయిన వ్యక్తిని విచారిస్తున్నారు.

అంతకుముందు కరీమ్‌గంజ్ జిల్లాలో ఇదే విధమైన ఆపరేషన్  నిర్వహించారు. ఈ ఘటనలో పోలీసులు డ్రగ్ పెడ్లర్‌ను అరెస్టు చేసి.. రూ. 45 కోట్ల విలువైన 1.5 లక్షల YABA టాబ్లెట్‌లను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!