AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Traffic Fines: మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే రక్తదానం చేయాల్సిందే.. అంతేకాదు..

మద్యం లేదా డ్రగ్స్ మత్తులో డ్రైవింగ్ చేస్తే రక్తదానం గానీ, సామాజిక సేవ గానీ చేయాల్సి ఉంటుందని ఉత్తర్వు జారీ చేసింది పంజాబ్ రవాణా శాఖ. అంతేకాదు డ్రైవింగ్ లైసెస్న్ కూడా సస్పెండ్ చేయబోతున్నట్లు తెలిపింది.

New Traffic Fines: మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే రక్తదానం చేయాల్సిందే.. అంతేకాదు..
Drunk And Drive
Ram Naramaneni
|

Updated on: Jul 18, 2022 | 9:19 AM

Share

Punjab: పంజాబ్ ప్రభుత్వం శుక్రవారం నోటిఫై చేసిన కొత్త ట్రాఫిక్ రూల్స్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. కొత్త నిబంధనల ప్రకారం, పంజాబ్‌లో వాహనాదారులు మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే రక్తదానం చేయాలి లేదంటే సమీపంలోని ఆసుపత్రిలో సమాజ సేవ చేయాలి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారు రవాణా శాఖ నిర్దేశించిన రిఫ్రెషర్ కోర్సు సర్టిఫికేట్ కూడా పొందవలసి ఉంటుంది. అలాగే ట్రాఫిక్ నిబంధనలపై 20 మంది((9 నుంచి 12 తరగతుల) పిల్లలకు రెండు గంటల పాటు అవగాహన కల్పించాల్సి ఉంటుంది.  అలాగే సమీపంలోని ఓ ఆసుపత్రిలో కనీసం 2 గంటల పాటు సామాజిక సేవ లేదా ఒక యూనిట్‌ రక్తం దానం చేయాలి. అతి వేగంతో ప్రయాణించినా కూడా ఫైన్స్ భారీగా ఉన్నాయి. పరిమితికి మించిన వేగంతో డ్రైవింగ్‌ చేస్తూ ఫస్ట్ టైమ్ పట్టుబడితే 1000 రూపాయలు, మళ్లీ దొరికితే రూ. 2,000 చొప్పున ఫైన్ విధిస్తారు. మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. అదే మద్యం లేదా డ్రగ్స్ మత్తులో బండి నడుపుతూ దొరికితే ఫస్ట్ టైమ్ రూ. 5,000.. తర్వాత రూ. 10,000 విధిస్తారు. మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారు.

ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానాలు ఇలా ఉన్నాయి:

రెడ్ లైట్ జంప్ చేయడం — మొదటి సారి 1,000,  సెకండ్ టైమ్ రూ. 2,000

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడం — మొదటి సారి 5,000, సెకండ్ టైమ్ రూ. 10,000

ద్విచక్ర వాహనాలపై ఇద్దరి కంటే ఎక్కువ మంది వ్యక్తులు ప్రయాణిస్తే — మొదటి సారి రూ. 1,000, సెకండ్ టైమ్  రూ. 2,000.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి