Narcotics: పెద్ద మొత్తంలో కొకైన్ పట్టివేత.. సినిమాను తలదన్నే స్టైల్‎లో స్మగ్లింగ్‎కి పాల్పడిన మహిళ..

|

Dec 20, 2023 | 4:24 PM

ఈమధ్య కాలంలో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది అసాంఘీక కార్యకలాపాలను యదేచ్చగా పాల్పడుతున్నారు. వీరిని పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. తాజాగా ముంబాయి ఎయిర్ పోర్టులో ఉగాండాకు చెందిన ఓ మహిళా ప్రయాణికురాలి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు కస్టమ్స్ అధికారులు.

Narcotics: పెద్ద మొత్తంలో కొకైన్ పట్టివేత.. సినిమాను తలదన్నే స్టైల్‎లో స్మగ్లింగ్‎కి పాల్పడిన మహిళ..
Drugs In Mumbai Airport
Follow us on

ఈమధ్య కాలంలో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది అసాంఘీక కార్యకలాపాలను యదేచ్చగా పాల్పడుతున్నారు. వీరిని పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. తాజాగా ముంబాయి ఎయిర్ పోర్టులో ఉగాండాకు చెందిన ఓ మహిళా ప్రయాణికురాలి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు కస్టమ్స్ అధికారులు. తమ దేశం నుంచి డ్రగ్స్ తరలించేందుకు వినూత్న పద్ధతిని అనుసరించారు. మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన ఓ మహిళ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని ముంబయి డీఆర్‌ఐ అధికారులు పక్కా ప్రణాళికతో ఛేదించారు.

ఆమె ధరించిన హెయిర్ విగ్ తో పాటూ లోదుస్తుల్లో తనిఖీ చేశారు. లోపల డ్రగ్స్‎ను దాచడం సంచలనం సృష్టించింది. గతంలో డ్రగ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ (DRI) నిర్వహించిన తనిఖీల్లో.. సానిటరీ ప్యాడ్‌లలో దాచిపెట్టడం, విస్కీ బాటిళ్లలో లిక్విడ్ కొకైన్, బ్లాక్ కొకైన్, మాయిశ్చరైజర్ బాటిళ్లలో కొకైన్ ఇలా అనేక రకాలుగా డ్రగ్స్ తరలించడాన్ని గుర్తించారు అధికారులు. అయితే ఈ కొత్త విధానాన్ని చూసి షాక్ అయ్యారు. ఓ మహిళ తన లోదుస్తులతో పాటూ తల విగ్‎లో దాచిన కొకైన్‎ను స్వాధీనపరుచుకుని సీజ్ చేశారు. మంగళవారం తెల్లవారుజామున డ్రగ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ నిర్వహించిన ఆపరేషన్‌లో ముంబై జోనల్ యూనిట్ అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ఆమె నుండి అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ. 8.9 కోట్ల విలువైన 890 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 1985 ఎన్డీపీఎస్ (NDPS) చట్టం నిబంధనల ప్రకారం నిషిద్ధ వస్తువును స్వాధీనం చేసుకున్నారు. ఇంకా, ప్రయాణికురాలిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మాదక ద్రవ్యాల మహమ్మారి నుండి సమాజాన్ని రక్షించడానికి డ్రగ్ సిండికేట్‌ల కార్యనిర్వహణను గుర్తించి, వాటిని ఛేదించడానికి ఒక ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీగా డిఆర్ఐ (DRI) అంకితభావంతో పనిచేస్తుందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..