AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత అమ్ముల పొదిలోకి “నాగ్‌” అస్త్రం.. త్వరలో

భారత అమ్ముల పొదిలోకి మరో అస్త్రం త్వరలో చేరనుంది. యుద్ధ ట్యాంకుల విధ్వంసక క్షిపణి అయిన “నాగ్‌”ను ఆదివారం విజయవంతంగా పరీక్షించినట్లు భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) వెల్లడించింది. రాజస్థాన్‌లోని పొఖ్రాన్‌లొ ఈ పరీక్షలు జరిగినట్లు తెలిపారు. మొత్తం మూడు సార్లు ఈ ప్రయోగం చేశామని.. రాత్రి, పగలు రెండు సమయాల్లో నాగ్‌ క్షిపణి తన లక్ష్యాన్ని చేధించిందిని వెల్లడించారు. కాగా, గతేడాది ఈ క్షిపణి శీతాకాల సామర్థ్య పరీక్షలను విజయవంతంగా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. […]

భారత అమ్ముల పొదిలోకి నాగ్‌ అస్త్రం.. త్వరలో
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 09, 2019 | 1:19 PM

Share

భారత అమ్ముల పొదిలోకి మరో అస్త్రం త్వరలో చేరనుంది. యుద్ధ ట్యాంకుల విధ్వంసక క్షిపణి అయిన “నాగ్‌”ను ఆదివారం విజయవంతంగా పరీక్షించినట్లు భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) వెల్లడించింది. రాజస్థాన్‌లోని పొఖ్రాన్‌లొ ఈ పరీక్షలు జరిగినట్లు తెలిపారు. మొత్తం మూడు సార్లు ఈ ప్రయోగం చేశామని.. రాత్రి, పగలు రెండు సమయాల్లో నాగ్‌ క్షిపణి తన లక్ష్యాన్ని చేధించిందిని వెల్లడించారు. కాగా, గతేడాది ఈ క్షిపణి శీతాకాల సామర్థ్య పరీక్షలను విజయవంతంగా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మరికొన్ని పరీక్షల అనంతరం ఇది భారత రక్షణ దళాల అమ్ములపొదిలో చేరనుంది.

థర్డ్‌జనరేషన్‌కు చెందిన ఈ నాగ్‌ క్షిపణికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకసారి దీన్ని పేల్చితే లక్ష్యాన్ని దానంతట అదే వేటాడుతూ వెళ్లే సామర్థ్యం దీని సొంతం. అంతేగాక దీనిలో ఉన్న అధునాతన ఇమేజింగ్‌ ఇన్‌ఫ్రారెడ్‌ రాడార్‌ సీకర్‌ సాంకేతికత కేవలం కొన్ని దేశాల వద్ద మాత్రమే ఉంది. దీనిద్వారా లక్ష్యంగా పెట్టుకున్న యుద్ధ ట్యాంక్‌ ఉష్ణోగ్రత, దాని పరిసరాల ఉష్ణోగ్రత మధ్య తేడాను పసిగట్టి లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో చేధించడం ఈ ఐఆర్‌ఆర్‌ ప్రత్యేకత. అలాగే ఈ మిస్సైల్ బరువు కూడా తక్కువగా ఉంటుందని.. ఎలాంటి ప్రదేశానికైనా దీనిని సులువుగా తరలించవచ్చని డీఆర్‌డీవో వెల్లడించింది.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..