Droupadi Murmu Nomination: ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్‌.. హాజరైన ప్రధాని మోదీ..

Presidential Elections 2022: ఎన్‌డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము కాసేపటి క్రితమే నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు..

Droupadi Murmu Nomination: ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్‌.. హాజరైన ప్రధాని మోదీ..
Draupadi Murmu

Updated on: Jun 24, 2022 | 1:19 PM

Presidential Elections 2022: ఎన్‌డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము కాసేపటి క్రితమే నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. నామినేషన్‌ దాఖలు చేసే కంటే ముందు ద్రౌపది ముర్ము పార్లమెంట్‌ ఆవరణలో గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. ఇదిలా ఉంటే మరోవైపు ఢిల్లీలోని ఒడిశా భవన్‌కు కేంద్ర మంత్రులు, ఒడిశా నేతలు చేరుకుంటున్నారు. ముర్ము నామినేషన్ పత్రంలో.. ప్రధాని మోడీ, నడ్డాతో సహా పలువురు అగ్ర నేతలు ప్రతిపాదిస్తూ, బలపరుస్తూ సంతకాలు చేశారు. రాష్ట్రప‌తి అభ్యర్థిగా పోటీ చేయాల‌నుకునే అభ్యర్థుల‌ను రాష్ట్రప‌తి ఎన్నికల్లో ఓటు హ‌క్కు క‌లిగిన 50 మంది ప్రతిపాదిస్తే.. మ‌రో 50 మంది బ‌ల‌ప‌ర‌చాల్సి ఉంటుంది.

జూలై 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌, 21న కౌంటింగ్‌ జరుగుతుంది. నామినేషన్లు జూన్ 29వ తేదీలోగా సమర్పించాల్సి ఉంటుంది. జులై 21 లోగా ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం జులై 24వ తేదీతో ముగియనుంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి తెలుగు రాష్ట్రాల నుంచి వైపీసీ మద్ధతు తెలిపిన విషయం తెలిసిందే. నామినేషన్‌ కార్యక్రమానికి వైసీపీ నుంచి విజయ్‌ సాయిరెడ్డి, లోక్‌ సభ ఫ్లోర్‌ లీడర్‌ మిథున్‌ రెడ్డి హాజరయ్యారు. నిజానికి ఈ కార్యక్రమానికి తొలుత సీఎం జగన్‌ స్వయంగా హాజరు కావాలని భావించారు. కానీ చివరి నిమిషంలో పర్యటన రద్దు చేసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..