యజమాని కోసం పాముతో కుక్క ఫైటింగ్..

మహారాష్ట్రలో యజమాని ప్రాణాలకు తన ప్రాణం అడ్డువేసింది ఓ కుక్క. తన యజమానితో పొలం దగ్గరకు వెళ్లిన కుక్క.. దారిలో నాగుపాయును చూసింది. అయితే నాగుపామును చూసిన యజమాని అక్కడి నుంచి పరుగులు తీశాడు. యజమాని పరుగులు పెట్టినా.. కుక్క మాత్రం నాగుపామును చూసి అదరలేదు, బెదరలేదు. బుసలు కొడుతున్న నాగుపామును ఒక్కఅడుగు కూడా ముందుకు కదలనీయకుండా కుక్క అటకాయించింది. బుసలు కొడుతున్న నాగుపాముతో కుక్క హోరాహోరీగా తలపడింది. దాదాపు 8 నిమిషాల పాటు పాముతో కుక్క […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:27 pm, Sat, 13 July 19
యజమాని కోసం పాముతో కుక్క ఫైటింగ్..

మహారాష్ట్రలో యజమాని ప్రాణాలకు తన ప్రాణం అడ్డువేసింది ఓ కుక్క. తన యజమానితో పొలం దగ్గరకు వెళ్లిన కుక్క.. దారిలో నాగుపాయును చూసింది. అయితే నాగుపామును చూసిన యజమాని అక్కడి నుంచి పరుగులు తీశాడు. యజమాని పరుగులు పెట్టినా.. కుక్క మాత్రం నాగుపామును చూసి అదరలేదు, బెదరలేదు. బుసలు కొడుతున్న నాగుపామును ఒక్కఅడుగు కూడా ముందుకు కదలనీయకుండా కుక్క అటకాయించింది. బుసలు కొడుతున్న నాగుపాముతో కుక్క హోరాహోరీగా తలపడింది. దాదాపు 8 నిమిషాల పాటు పాముతో కుక్క ఫైటింగ్ చేసింది. అదును చూసి బుసలు కొడుతున్న నాగుపామును పట్టుకుని చంపేందుకు కుక్క చాలాసేపు పోరాటం చేసింది.

కుక్క ఫైటింగ్‌తో అలసిపోయిన నాగుపాము కదలకుండా అలాగే ఉండిపోయింది. ఇదే అదునుగా భావించిన కుక్క.. పామును నోట కరుచుకుని అక్కడి నుంచి పరుగులు తీసింది. అయితే పాము తనను తాను రక్షించుకునేందుకు కుక్కను కాటేసింది. దీంతో కొద్దిసేపటికే కుక్క మృతి చెందింది. తన ప్రాణాల్ని రక్షించేందుకు కుక్క చేసిన పోరాటం.. ఆ పోరాటంలో కుక్క చనిపోవడంతో యజమాని కన్నీటి పర్యంతమయ్యాడు.